మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా మూడో రోజూ ఇంధన ధరలు పెరిగాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం.. మే 4 నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా వరుసగా మూడో రోజూ లీటరు పెట్రలోపై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసల చొప్పున ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు గురువారం రేట్లను సవరించాయి. సవిరంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ. 90.99 కి […]
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా మూడో రోజూ ఇంధన ధరలు పెరిగాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం.. మే 4 నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా వరుసగా మూడో రోజూ లీటరు పెట్రలోపై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసల చొప్పున ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు గురువారం రేట్లను సవరించాయి. సవిరంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ. 90.99 కి చేరగా డీజిల్ రూ. 81.42 లకు పెరిగింది. ఇక ఇవే ధరలు హైదరాబాద్‌లో రూ.94.57, రూ. 88.77 గా నమోదయ్యాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్ ధర వంద (రూ.97.34) కు చేరువలో ఉంది.