'టీమ్ ఇండియా భవిష్యత్ కెప్టెన్ రిషబ్ పంత్'

దిశ, స్పోర్ట్స్: యువ వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ భవిష్యత్‌లో భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతాడని మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజ అభిప్రాయపడ్డాడు. గత ఐపీఎల్ నుంచి ఇప్పటి వరకు పంత్‌ను గమనిస్తే ఒక పరిణితి చెందిన క్రికెటర్ కనిపిస్తాడని ఆయన అన్నాడు. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన రిషబ్ పంత్ 6 మ్యాచ్‌లకు గాను 4 మ్యాచ్‌లలో విజయం అందించాడు. ఆర్సీబీపై ఒక పరుగు […]

Update: 2021-04-28 09:25 GMT

దిశ, స్పోర్ట్స్: యువ వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ భవిష్యత్‌లో భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతాడని మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజ అభిప్రాయపడ్డాడు. గత ఐపీఎల్ నుంచి ఇప్పటి వరకు పంత్‌ను గమనిస్తే ఒక పరిణితి చెందిన క్రికెటర్ కనిపిస్తాడని ఆయన అన్నాడు. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన రిషబ్ పంత్ 6 మ్యాచ్‌లకు గాను 4 మ్యాచ్‌లలో విజయం అందించాడు. ఆర్సీబీపై ఒక పరుగు తేడాతో ఓడిపోయిన తర్వాత అతడిపై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే ప్రజ్ఞాన్ ఓజా మాత్రం పంత్‌కు అండగా నిలిచాడు. ‘పంత్ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. అంతే కాకుండా బ్యాటింగ్‌లో కూడా మంచి పరిపక్వతనే చూపిస్తున్నాడు. ఇదే విధంగా అతడి కెరీర్ కొనసాగిస్తే భవిష్యత్‌లో తప్పకుండా టీమ్ ఇండియాకు కెప్టెన అయ్యే అవకాశాలు ఉన్నాయి. సౌరవ్ గంగూలీ, ధోనీ వంటి వారు ఇలాగే కెప్టెన్లుగా మారారు. ప్రస్తుతానికి పంత్ కెప్టెన్సీ అనేది చాలా దూరంలో ఉన్నది. కానీ ఇప్పటి నుంచే అతడిని కెప్టెన్ మెటీరియల్‌గా మార్చే అవకాశం ఉన్నది. ఈ విషయంలో ప్రధాన కోచ్ రవిశాస్త్ర శ్రద్ద తీసుకోవాలి’ అని ప్రజ్ఞాన్ ఓజా అన్నాడు.

Tags:    

Similar News