గ్రీన్ ఎనర్జీ రంగంలో విదేశీ కంపెనీని సొంతం చేసుకున్న రిలయన్స్ సంస్థ
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గ్రీన్ ఎనర్జీ రంగంలో దూకుడు పెంచుతోంది. ఈ ఏడాది సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధినేత ముఖేష్ అంబానీ ఈ రంగంలో భారీగా పెట్టుబడులను పెట్టనున్నట్టు చెప్పారు. అందులో భాగంగా తాజాగా ఆర్ఐఎల్ అనుబంధ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ కంపెనీ ఆదివారం చైనా నేషనల్ బ్లూస్టార్(గ్రూప్) నుంచి ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్ ఏఎస్(ఆర్ఈసీ గ్రూప్)లోని పూర్తిగా 100 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్టు […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గ్రీన్ ఎనర్జీ రంగంలో దూకుడు పెంచుతోంది. ఈ ఏడాది సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధినేత ముఖేష్ అంబానీ ఈ రంగంలో భారీగా పెట్టుబడులను పెట్టనున్నట్టు చెప్పారు. అందులో భాగంగా తాజాగా ఆర్ఐఎల్ అనుబంధ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ కంపెనీ ఆదివారం చైనా నేషనల్ బ్లూస్టార్(గ్రూప్) నుంచి ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్ ఏఎస్(ఆర్ఈసీ గ్రూప్)లోని పూర్తిగా 100 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ ఒప్పందం విలువ 771 మిలియన్ డాలర్ల(రూ. 5,792 కోట్ల)ని కంపెనీ వెల్లడించింది. రిలయన్స్ గ్రూప్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ఆర్ఈసీ గ్రూప్ అంతర్జాతీయ సౌర శక్తి సంస్థ. నార్వే ప్రధాన కార్యాలయం కలిగిన ఆర్ఈసీ సంస్థకు సింగపూర్, ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆసియా-పసిఫిక్‌లలో ప్రాంతీయ కేంద్రాలున్నాయి. ఈ రంగంలో సాంకేతిక ఆవిష్కరణలు, అధిక సామర్థ్యం, దీర్ఘకాల సోలార్ సెల్స్, ప్యానెల్స్ ద్వారా సరసరమైన సౌర విద్యుత్‌ను అందిస్తోంది. 25 ఏళ్ల సుధీర్ఘ అనుభవం ఉన్న మూడు తయారీ కేంద్రాలు ఈ సంస్థకున్నాయని తెలిపింది. కాగా, అత్యాధునిక సెల్స్ తయారీలో దిగ్గజ స్థానానికి చేరేందుకు ఆర్ఐఎల్ సంస్థ ప్రయత్నిస్తోంది. దీనిద్వారా 2030 నాటికి 100 గిగావాట్ల సౌరశక్తి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ఉంది. అంతేకాకుండా భారత ప్రభుత్వం నిర్దేశించిన ఈ ఏఆది పునరుత్పాదక శక్తి 450 గిగావాట్ల సౌరశక్తి లక్ష్యానికి మద్దతుగా నిలవనున్నట్టు వెల్లడించింది.