ఎలక్ట్రానిక్ రంగంలో రిలయన్స్ భారీ పెట్టుబడులు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఎస్‌బీవీఎల్) కంపెనీ ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ నియోలింక్ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు పెట్టినట్టు ప్రకటించింది. ఈక్విటీ షేర్లలో రూ. 20 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్టు గురువారం వెల్లడించింది. అంతేకాకుండా 2030, మార్చి నాటికి నియోలింక్‌లో రూ. 40 కోట్ల వరకు పెట్టుబడులను పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపింది. ఈ పెట్టుబడులు నియోలింక్ అంగీకరించిన ఒప్పందాలకు లోబడి ఉంటాయని ఆర్ఐఎల్ […]

Update: 2021-08-05 10:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఎస్‌బీవీఎల్) కంపెనీ ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ నియోలింక్ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు పెట్టినట్టు ప్రకటించింది. ఈక్విటీ షేర్లలో రూ. 20 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్టు గురువారం వెల్లడించింది. అంతేకాకుండా 2030, మార్చి నాటికి నియోలింక్‌లో రూ. 40 కోట్ల వరకు పెట్టుబడులను పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపింది.

ఈ పెట్టుబడులు నియోలింక్ అంగీకరించిన ఒప్పందాలకు లోబడి ఉంటాయని ఆర్ఐఎల్ ఓ ప్రకటనలో వివరించింది. ప్రస్తుత పెట్టుబడుల ద్వారా రిలయన్స్ సంస్థ నియోలింక్‌లోని ఈక్విటీ షేర్‌లో 40 శాతానికి సమానం. కాగా, నియోలింక్ సొల్యూషన్స్ సంస్థ, దాని అనుబంధ సంస్థలు, అసోసియేట్ సంస్థలు దేశీయంగా మొబైల్‌ఫోన్, టెలికాం ఉత్పత్తులు, కంప్యూటింగ్ పరికరాలు మొదలైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ రూ. 3.26 కోట్ల ఆదాయాన్ని కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1.03 కోట్ల నికర నష్టాలను కంపెనీ వెల్లడించింది. ఈ సంస్థలో రిలయన్స్ సంస్థ పెట్టుబడులు తన 5జీ టెక్నాలజీలో భాగంగా తీసుకున్న నిర్ణయమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News