మహిళలకు బహు భర్తత్వం.. చటబద్ధతకు ప్రతిపాదన!

దిశ, ఫీచర్స్ : పురుషులకు బహు భార్యత్వం గురించి వినే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఈ తరహా చట్టం అమలవుతుండగా.. విమర్శలు కూడా అంతే స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా ప్రభుత్వం కొత్తగా బహు భర్తత్వ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. సమానత్వాన్ని తీసుకొచ్చే దిశగా ఆ దేశ మహిళలు ఎంతమంది పురుషులనైనా పెళ్లి చేసుకునేందుకు చట్టాన్ని తెస్తామంటోంది. ప్రస్తుతం ఈ విషయం ఆ దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచ దేశాల్లో అమలవుతున్న రాజ్యాంగాల్లో […]

Update: 2021-06-29 05:35 GMT

దిశ, ఫీచర్స్ : పురుషులకు బహు భార్యత్వం గురించి వినే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఈ తరహా చట్టం అమలవుతుండగా.. విమర్శలు కూడా అంతే స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా ప్రభుత్వం కొత్తగా బహు భర్తత్వ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. సమానత్వాన్ని తీసుకొచ్చే దిశగా ఆ దేశ మహిళలు ఎంతమంది పురుషులనైనా పెళ్లి చేసుకునేందుకు చట్టాన్ని తెస్తామంటోంది. ప్రస్తుతం ఈ విషయం ఆ దేశంలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రపంచ దేశాల్లో అమలవుతున్న రాజ్యాంగాల్లో సౌతాఫ్రికా ఇప్పటికే అత్యంత ఉదారవాద విధానాలు అవలంబిస్తోంది. స్వలింగ వివాహాలకు అనుమతించడంతో పాటు పురుషులకు బహుభార్యత్వ (పాలిగమీ) హక్కులను కల్పించింది. ఒకరి కంటే ఎక్కువమంది భర్తలున్న మహిళలు, పాలిండరస్ యూనియన్లను (ఒక కుటుంబంలోని సోదరులందరికీ ఒక్కరే భార్య) చట్టబద్ధం చేయాలని లింగ హక్కుల కార్యకర్తలు ప్రభుత్వానికి అనేకసార్లు పిటిషన్ సమర్పించారు. దాంతో అన్ని రకాల వివాహాలతో పాటు పాలియాండ్రీ(బహు భర్తత్వం)ని చట్టబద్ధం చేస్తూ హోం ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్ ప్రచురించిన గ్రీన్ పేపర్‌లో చోటు కల్పించింది. అయితే దేశంలోని మ్యారేజ్ యాక్ట్‌లో సంస్కరణలు చేపడుతున్న ప్రభుత్వ నిర్ణయాన్ని సంప్రదాయవాదులు, మత సమూహాలు వ్యతిరేకిస్తున్నాయి.

సంప్రదాయవాదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

పాలియాండ్రీని బలంగా వ్యతిరేకిస్తున్న వారిలో టీవీ పర్సనాలిటీ మూసా మెలేకు ఒకరు. నలుగురు భార్యలున్న ఆయన.. ఈ విధానం ఆఫ్రికన్ కల్చర్‌ను నాశనం చేస్తుందని అంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో వారికి పుట్టే పిల్లల పరిస్థితి ఏంటి? వారి ఐడెంటిటీని ఎలా గుర్తిస్తారు? పురుషుడి పాత్రను స్త్రీ తీసుకోలేదు కదా! ఆమె ఇంటి పేరును స్వీకరించేందుకు అతడు సిద్ధంగా ఉంటాడా? అని ప్రశ్నిస్తున్నారు.

ఇక ఆఫ్రికన్ క్రిస్టియన్ డెమొక్రటిక్ పార్టీ లీడర్ రెవరెండ్ కెన్నెత్ మిషోయ్.. బహు భార్యత్వం అంగీకారమైన విధానమే కానీ, బహు భర్తత్వం అలా కాదని అన్నారు. ఎక్కువమంది భర్తలుండటం అమలుకు నోచుకోదని, ఎందుకంటే ‘పురుషులు అసూయ, తనకే దక్కాలనే స్వభావం’ గలవారని వెల్లడించాడు. కాగా ఆఫ్రికన్ సమాజాలు నిజమైన సమానత్వానికి సిద్ధంగా లేవని పాలియాండ్రీపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్ కొలిస్ మాకో తెలిపారు.

గ్రీన్ పేపర్ అంటే?

సీఎన్ఎన్ రిపోర్టు ప్రకారం.. దక్షిణాఫ్రికా ప్రభుత్వ హోమ్ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్ ప్రతిపాదిత పాలసీ మార్పుకు సంబంధించి కీలక సమస్యలను ట్రెడిషనల్ లీడర్స్‌తో పాటు మానవ హక్కుల ఉద్యమకారులు, ఇతరత్రా గ్రూపులతో సంప్రదింపులు జరిపింది. ఈ మేరకు ప్రజా నాయకులతో పాటు మతచాందసవాదులు పాలియాండ్రీ కల్చర్‌పై అభ్యంతరం వ్యక్తం చేయగా.. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ మాత్రం ‘సమానత్వం కావాలంటే పాలియాండ్రీని చట్టబద్ధ వివాహంగా గుర్తించాలి’ అని కోరారు. పాలియాండ్రీ అమలు విషయాన్ని పక్కనబెడితే, మైనర్ల వివాహాలను అనుమతించే ప్రస్తుత చట్టాలను సరిదిద్దాలని గ్రీన్ పేపర్‌లో ప్రతిపాదించారు. అయితే తమ జెండర్‌ను మార్చుకుని, డైవర్స్ తీసుకోకుండానే మరో పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు ఇది వర్తించదని పేర్కొన్నారు. అంతేకాదు ముస్లిం, హిందూ, యూదు, రాస్తా ఫేరియన్ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని ఈ పత్రం ప్రతిపాదించగా.. ఈ చర్యలను సంబంధిత వర్గాలు స్వాగతించాయి.

Tags:    

Similar News