టీమిండియాకు షాక్.. అంపైర్ మళ్లీ అతడే.. WTC రిపీటేనా..?
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ రంగంలో ఆయా జ ఆటగాళ్లు.. వారి వారి సామర్థ్యాలకు తగినట్టుగా రాణిస్తే విజయం ఆ వైపే ఉంటుంది. ఏ మాత్రం ఒత్తిడికి లోనైయినా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినా పరాజయం తప్పదు. కానీ, గత కొన్నేండ్లుగా టీమిండియా నాకౌట్ మ్యాచుల్లో మాత్రం జట్టులో సంబంధం లేని వ్యక్తి మైదానంలో నిలబడితే చాలు.. ఆ మ్యాచ్‌లో ఓటమి తప్పదంటూ ఏకంగా అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ముందు నెలకొన్న ఈ సందేహం.. మరికొద్ది […]
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ రంగంలో ఆయా జ ఆటగాళ్లు.. వారి వారి సామర్థ్యాలకు తగినట్టుగా రాణిస్తే విజయం ఆ వైపే ఉంటుంది. ఏ మాత్రం ఒత్తిడికి లోనైయినా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినా పరాజయం తప్పదు. కానీ, గత కొన్నేండ్లుగా టీమిండియా నాకౌట్ మ్యాచుల్లో మాత్రం జట్టులో సంబంధం లేని వ్యక్తి మైదానంలో నిలబడితే చాలు.. ఆ మ్యాచ్‌లో ఓటమి తప్పదంటూ ఏకంగా అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ముందు నెలకొన్న ఈ సందేహం.. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌లో మరోసారి రిపీట్ అవుతోంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం సాయంత్రం ఇండియా-న్యూజీలాండ్ జట్లు టీ20 వరల్డ్‌కప్‌లో కీలక మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధించినా.. సెమీస్ బెర్త్ కన్ఫామ్. ఓడిన జట్టు మిగిలిన మ్యాచ్‌లు ఆడినా.. ఇంటిబాట పట్టాల్సిందే. దీంతో గ్రూప్ మ్యాచ్ ఏకంగా క్వార్టర్ ఫైనల్‌ను తలపిస్తోంది. ఇటువంటి ఉత్కంఠ సమయంలో అంపైర్‌గా ఉండే వ్యక్తి టీమిండియా అభిమానులను కలవరపెడుతున్నాడు.
ఇంతకీ అతనెవరంటే..
ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరో అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. విచిత్రం ఏంటంటే ఇతడు అంపైర్ చేసిన కీలక మ్యాచుల్లో టీమిండియా ఓడిపోగా.. ప్రత్యర్థి జట్టుకు లాభం జరిగింది. 2014 టీ20 వరల్డ్ కప్, 2015 వన్డే వరల్డ్ కప్, 2016 టీ 20 వరల్డ్ కప్, 2017లో చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్‌తో పాటు.. మొన్నటికి మొన్న జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్(WTC) మ్యాచులకు ఇతడే అంపైర్ ఉండగా.. ఈ సిరీస్‌లను టీమిండియా కోల్పోయింది. పైగా అన్నీ నాకౌట్ మ్యాచ్‌లే కావడం గమనార్హం. ఈ వ్యవహారంపై వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ కంటే ముందే చర్చనీయాంశం అయింది. అతడిని అంపైర్‌గా నియమించవద్దు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు పెట్టారు. మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం మ్యాచ్‌లోనూ..
అయితే, మరి కొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఇండియా-న్యూజీలాండ్ మ్యాచ్‌కు ఇతడే అంపైర్ ఉండడంతో అభిమానులు మళ్లీ ఆందోళన మొదలుపెట్టారు. ‘ఈ మ్యాచ్ ఏదో తేడాగా ఉందే.. వీడు తప్పా వేరే అంపైర్ దొరకలేదా’ అంటూ మీమ్స్‌ను వైరల్ చేస్తున్నారు. ఇదే సమయంలో టీమిండియా ఓడిపోతుందేమో అన్న భయంతో పడ్డారు. ఈ అంపైర్ వ్యవహారంపై ఇప్పటివరకు ఏ క్రికెటర్ స్పందించనప్పటికీ.. జట్టు ఆడే విధానంలోనే గెలుపు-ఓటములు నిర్ణయం అవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. అనవసరంగా అంపైర్‌ను నిందించడం కరెక్ట్ కాదని చెప్పుకొస్తున్నారు.
కానీ, ఈ ఏడాది హాట్ ఫేవరేట్లుగా బరిలోకి దిగిన ఇరు జట్లు పాకిస్తాన్ చేతితో ఓడిపోయి.. సెమీస్ బెర్త్ కోసం ఈ మ్యాచ్‌పైనే ఫోకస్ పెట్టాయి. దీంతో విజయం ఎవరిని వరిస్తుంది అనేది ఓ వైపు ఉత్కంఠ రేపుతుంటే.. అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరోతో భారత అభిమానులకు ఓటమి భయం పట్టుకున్నట్టైంది.
Richard Kettleborough Has Been Unlucky For India In Knock Out Games! pic.twitter.com/dfVX4ebaKV
— Dev Verma🇮🇳 (@DevVermaByt) May 25, 2021