నలుగురి కోసం 180 సీట్ల విమానం!

కరోనా భయంతో పక్కన వాళ్లను ముట్టుకుందామంటే కొన్ని సార్లు భయం కలుగుతోంది. ఇక డబ్బున్న వాళ్లకి ఇలాంటి భయాలు చాలా ఎక్కువ. అందుకే భోపాల్‌కి చెందిన ఓ ధనవంతుడు తన కుటుంబంలోని నలుగురిని ఢిల్లీకి పంపించడానికి 180 సీట్ల విమానాన్ని ఒక్కరోజు అద్దెకు తీసుకున్నాడట. పూర్తి వివరాలు తెలియరాలేదు. కానీ భోపాల్ విమానాశ్రయ సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం ఆ ధనవంతుడు ఒక లిక్కర్ బ్రాండ్‌కి యజమాని అని మాత్రం తెలిసింది. కొవిడ్ 19 లాక్‌డౌన్ కారణంగా […]

Update: 2020-05-28 05:41 GMT

కరోనా భయంతో పక్కన వాళ్లను ముట్టుకుందామంటే కొన్ని సార్లు భయం కలుగుతోంది. ఇక డబ్బున్న వాళ్లకి ఇలాంటి భయాలు చాలా ఎక్కువ. అందుకే భోపాల్‌కి చెందిన ఓ ధనవంతుడు తన కుటుంబంలోని నలుగురిని ఢిల్లీకి పంపించడానికి 180 సీట్ల విమానాన్ని ఒక్కరోజు అద్దెకు తీసుకున్నాడట. పూర్తి వివరాలు తెలియరాలేదు. కానీ భోపాల్ విమానాశ్రయ సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం ఆ ధనవంతుడు ఒక లిక్కర్ బ్రాండ్‌కి యజమాని అని మాత్రం తెలిసింది.

కొవిడ్ 19 లాక్‌డౌన్ కారణంగా ఆ ధనవంతుడి కూతురు, ఆమె ఇద్దరు పిల్లలు భోపాల్‌లో రెండు నెలల పాటు ఇరుక్కుపోయారు. ఇక లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వం వాయురవాణాకు అనుమతి ఇవ్వగానే ఆ ధనవంతుడు 180 మంది కూర్చోగల ఎ320 విమానాన్ని అద్దెకు తీసుకున్నాడు. మే 25 సోమవారం రోజున భోపాల్ విమానాశ్రయానికి వచ్చిన ఈ విమానంలో ధనవంతుడి కూతురు, ఆమె పిల్లలతో పాటు వారి పనిమనిషి నలుగురు కలిసి ఢిల్లీకి వెళ్లినట్లు ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు తెలిపారు. ఇంతకీ ఆ ఒక్కరోజు కోసం ఆ విమానాన్ని అద్దెకు తీసుకోవడానికి ఆ ధనవంతుడు ఎంత చెల్లించాడో తెలుసా? అక్షరాల రూ. 20 లక్షలు.

Tags:    

Similar News