‘అర్నాబ్ – ది న్యూస్ ప్రాస్టిట్యూట్’ పోస్టర్ విడుదల
దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక అభ్యంతరకర సినిమా తీస్తు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఇప్పటికే మర్డర్, పవర్ స్టార్ సినిమాలతో పలువురి నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, న్యూస్ యాంకర్ అర్నాబ్ గోస్వామిపై సినిమా తీస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు. దీనికి ‘అర్నాబ్ -ది న్యూస్ ప్రాస్టిట్యూట్’ టైటిల్ ఖరారు చేస్తూ మరో వివాదానికి తెరలేపారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ఆర్జీవీ తన […]
దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక అభ్యంతరకర సినిమా తీస్తు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఇప్పటికే మర్డర్, పవర్ స్టార్ సినిమాలతో పలువురి నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, న్యూస్ యాంకర్ అర్నాబ్ గోస్వామిపై సినిమా తీస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు. దీనికి ‘అర్నాబ్ -ది న్యూస్ ప్రాస్టిట్యూట్’ టైటిల్ ఖరారు చేస్తూ మరో వివాదానికి తెరలేపారు.
అయితే, ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ఆర్జీవీ తన ట్విట్టర్‌లో విడుదల చేశాడు. అందులో డిబేట్ అని అక్షరాలను బ్యాక్ గ్రౌండ్‌లో పెట్టి.. అర్నాబ్ పాత్ర చేస్తున్న నటుడిని చూపిస్తూ.. డబ్బులను.. మరో అమ్మాయి నడుము వంచి నగ్నంగా ఫోజ్ ఇస్తున్న ఫోటోను పోస్టర్‌గా విడుదల చేశాడు. ఈ సందర్భంగా ఆర్జీవీ ట్వీట్ చేస్తూ.. అర్నాబ్-ది న్యూస్ ప్రాస్టిట్యూట్ అని టైటిల్ మెన్షన్ చేయడమే కాకుండా.. ‘దేశం తెలుసుకోవాలనుకుంటుంది.. నేషన్ తెలుసుకుంటుంది’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే, మరో ట్వీట్‌లో పోస్టర్ వీడియోను షేర్ చేస్తూ.. బ్యాక్ గ్రౌండ్‌లో డిబేట్ జరుగుతున్న వాయిస్ ఓవర్ వదలడం గమనార్హం.
ARNAB
The News ProstituteTHE NATION WILL KNOW THE TRUTH behlnd what THE NATION WANTS TO KNOW. pic.twitter.com/f1ZNBLzTkD
— Ram Gopal Varma (@RGVzoomin) August 12, 2020