వర్మ ట్వీట్.. వార్మ్ ట్రీట్
ఆర్జీవీలో మరో కోణం కనిపించింది. ఎప్పుడూ రఫ్‌గా కనిపించే రామ్ గోపాల్ వర్మ.. ఎమోషనల్ అయ్యాడు. సినిమాల్లో హీరోయిన్ల అందానికి దాసోహమయ్యానని నాఠీగా ఆన్సర్ ఇచ్చే వర్మ … నిజజీవితంలో మానవ మృగాల చేతిలో బలైన నిర్భయ, దిశ, సమత లాంటి ఘటనలపై ఉద్వేగానికి లోనయ్యాడు. సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాల నుంచి దుర్మార్గులకు భయంకరమైన పాఠం చెప్పేందుకు “దిశ” అనే సినిమాతో రాబోతున్నాడు. నిర్భయ […]
ఆర్జీవీలో మరో కోణం కనిపించింది. ఎప్పుడూ రఫ్‌గా కనిపించే రామ్ గోపాల్ వర్మ.. ఎమోషనల్ అయ్యాడు. సినిమాల్లో హీరోయిన్ల అందానికి దాసోహమయ్యానని నాఠీగా ఆన్సర్ ఇచ్చే వర్మ … నిజజీవితంలో మానవ మృగాల చేతిలో బలైన నిర్భయ, దిశ, సమత లాంటి ఘటనలపై ఉద్వేగానికి లోనయ్యాడు. సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాల నుంచి దుర్మార్గులకు భయంకరమైన పాఠం చెప్పేందుకు “దిశ” అనే సినిమాతో రాబోతున్నాడు.
నిర్భయ కేసులో న్యాయం కోసం నిర్భయతల్లి ఏళ్లకు ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. తన బిడ్డపై క్రూరంగా అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలంటూ న్యాయస్థానాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంది. 2012 నుంచి ఇప్పటివరకు కూడా ఆ న్యాయదేవత కళ్లకు గంతలు కట్టుకునే ఉంది. ఫిబ్రవరి 1న ఉరిశిక్ష ఖరారు అయినా… చట్టంలోని లొసుగులను పట్టుకుని నిర్భయ దోషులు శిక్ష నుంచి మళ్లీ తప్పించుకున్నారు. ఈ సందర్భంగా నిర్భయ తల్లి ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెడుతుండగా … నిర్భయ దోషుల తరపు న్యాయవాది ఏ పీ సింగ్ తనకు బాహాటంగానే వార్నింగ్ ఇచ్చాడు. నిర్భయ దోషులను కాపాడుతూనే ఉంటానని, ఈ వాయిదాల పర్వం శాశ్వతంగా కొనసాగుతుంటుందని చెప్పాడు.
ఈ ఘటన చూసిన ఎవ్వరికైనా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఈ సీన్‌నే చూసిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ రక్తం ఉడికిపోయింది. ఏపీ సింగ్ మీద ఆగహాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. నిర్భయ నిందితులు శిక్ష నుంచి తప్పించుకుంటూనే ఉంటున్నారు.. ఇలాంటి వ్యవస్థలో మార్పు తీసుకురాలేరా.. మోడీజీ అంటూ మన ప్రధానమంత్రిని కూడా ప్రశ్నించారు వర్మ. కానీ ఏం లాభం లేదు. అందుకే ఇలాంటి శిక్షలు కాదు… నిర్భయ లాంటి కేసులు జరిగితే ఎన్‌కౌంటరే బెటర్ అనే ఆప్షన్‌కు వచ్చాడు వర్మ. ఇలాంటి ఘటనే దిశ విషయంలో జరగగా నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. అదే అసలైన జస్టిస్ అంటున్నాడు వర్మ. అందుకే ” దిశ ” సినిమాను తెరకెక్కించి సమాజానికి సరైన గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయ్యాడు.
“దిశ” సినిమాను ప్రకటించిన డైరెక్టర్ వర్మ… ఈ మూవీని పట్టాలెక్కించేందుకు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. అసలు దిశ ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎలాంటి అమ్మాయి? ఏం చేస్తుంది? ఇలాంటి వివరాలు సేకరించిన వర్మ… తర్వాత నిందితుల సైడ్ నుంచి రీసెర్చ్ చేయడం మొదలెట్టాడు. నిందితుల్లో ఒక్కరైన చెన్నకేశవులు భార్య రేణుకను కలిశాడు. పదిహేడేళ్ల మైనర్ బాలిక కడుపులో మరో చిన్నారిని మోస్తూ ఉండడం … భర్త లేని ఆమె భవిష్యత్, తన బిడ్డ భవిష్యత్ ఏంటో తెలియకుండా దిక్కతోచని పరిస్థితుల్లో కనిపించడం ఆర్జీవీని కలిచి వేసింది. చేయని తప్పునకు బలవుతున్న రేణుకకు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. రేణుకకు ఆర్థికంగా సహాయం చేసిన వర్మ… దిశ ట్రాజెడీలో పరోక్షంగా బలైన తనను ఆదుకోవాలని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశాడు.
ఆర్జీవీ రేణుకకు ఆర్థికంగా చేయూతనివ్వడం .. మీరు కూడా చేయాలి.. ఇది మన బాధ్యత అని చెప్పడాన్ని పాజిటివ్‌గా తీసుకుని సహాయం చేస్తున్నారు అభిమానులు. ఆర్జీవీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మరికొందరు ఆర్జీవీలో ఇన్ని కోణాలు ఉన్నాయా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇదే వర్మ ఒరిజినల్ క్యారెక్టర్ అంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు.