ఇక రెవెన్యూ, రిజిస్ట్రేషన్లన్నీ ఒక్కచోట

దిశ, ఏపీ బ్యూరో : సమగ్ర భూసర్వే పూర్తయితే రిజిస్ర్టేషన్లు, రెవెన్యూ సేవలు గ్రామ సచివాలయం నుంచే పొందొచ్చని సీఎం జగన్​ వెల్లడించారు. ‘వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’లో భాగంగా బుధవారం సర్వే ఆఫ్‌ ఇండియాతో రాష్ర్ట ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ​ద్వారా సీఎం.. కలెక్టర్లతో మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా ఇంత పెద్దస్థాయిలో సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ఇంటి స్థలం, పొలం, స్థిరాస్తులపై ఒక టైటిల్‌ ఇచ్చిన తర్వాత రెండేళ్ల పాటు అబ్జర్వేషన్‌లో […]

Update: 2020-12-09 08:23 GMT

దిశ, ఏపీ బ్యూరో : సమగ్ర భూసర్వే పూర్తయితే రిజిస్ర్టేషన్లు, రెవెన్యూ సేవలు గ్రామ సచివాలయం నుంచే పొందొచ్చని సీఎం జగన్​ వెల్లడించారు. ‘వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’లో భాగంగా బుధవారం సర్వే ఆఫ్‌ ఇండియాతో రాష్ర్ట ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ​ద్వారా సీఎం.. కలెక్టర్లతో మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా ఇంత పెద్దస్థాయిలో సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ఇంటి స్థలం, పొలం, స్థిరాస్తులపై ఒక టైటిల్‌ ఇచ్చిన తర్వాత రెండేళ్ల పాటు అబ్జర్వేషన్‌లో అదే గ్రామ సచివాలయంలో పెడతామని వెల్లడించారు. ఆ టైటిల్‌ మీద ఏమైనా అభ్యంతరాలుంటే తెలుపవచ్చన్నారు. రెండేళ్ల తర్వాత టైటిల్‌కు శాశ్వత భూహక్కు లభించండతోపాటు టైటిల్‌ ఖరారు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఏమైనా అభ్యంతరాలుంటే ప్రభుత్వమే బాధ్యతంగా పరిహారం చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ సర్వే వందేళ్ల తర్వాత జరుగుతోందన్నారు. రికార్డులన్నింటినీ కూడా డిజిటలైజేషన్‌ చేస్తామని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సర్వే రికార్డులు ఉంటాయని తెలిపారు.

Tags:    

Similar News