అమరవీరుల స్థూపం ఇంకెన్ని రోజులు కడ్తరు.. సీఎం కేసీఆర్‌పై రేవంత్ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సాధనలో ప్రాణాలను అర్పించిన అమరవీరులకు గుర్తుగా అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్మిస్తోంది. ట్యాంక్‌బండ్ వద్ద గల లుంబినీ పార్క్ పక్కనే దాదాపు మూడు ఎకరాల్లో నిర్మిస్తున్నారు. వంద కోట్లు ఖర్చు చేసి.. కేవలం ఆరు నెలల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంది. కానీ, కొన్ని రోజుల వరకు నిర్మాణం జరిగినప్పటికీ మధ్యలోనే ఆగిపోయింది. కానీ, స్థూపం నిర్మాణానికి సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించలేదంటూ […]
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సాధనలో ప్రాణాలను అర్పించిన అమరవీరులకు గుర్తుగా అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్మిస్తోంది. ట్యాంక్‌బండ్ వద్ద గల లుంబినీ పార్క్ పక్కనే దాదాపు మూడు ఎకరాల్లో నిర్మిస్తున్నారు. వంద కోట్లు ఖర్చు చేసి.. కేవలం ఆరు నెలల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంది. కానీ, కొన్ని రోజుల వరకు నిర్మాణం జరిగినప్పటికీ మధ్యలోనే ఆగిపోయింది. కానీ, స్థూపం నిర్మాణానికి సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించలేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం అమరవీరుల స్థూప నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. నిర్మాణం మొదలుపెట్టి రెండేళ్లు దాటినా.. నిర్మాణం చేయకపోవడం సరికాదంటూ మండిపడ్డారు. సీఎం అధికార నివాసాన్ని మాత్రం 9 నెలల్లో నిర్మాణం పూర్తి చేశారు కదా మరి అమరవీరుల స్థూపం నిర్మాణానికి ఎందుకింత సమయం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వ్యయాన్ని 60 కోట్ల నుంచి 180 కోట్లకు పెంచి ఏడాది అవుతున్నా పనులు జరపడం లేదని.. అసలు పూర్తి చేయాలన్న ఉద్ధేశ్యం ప్రభుత్వానికి ఉందా అంటూ రేవంత్ ప్రశ్నించారు.
This is the pathetic condition at the site of #AmaraVeerulaStupam meant for Telangana Martyrs.@TelanganaCMO constructed his official residence in 9 months…
But has no intention of completing this memorial in years even after increasing the estimate from 60 cr to 180cr. pic.twitter.com/QKJzoDuqFO— Revanth Reddy (@revanth_anumula) December 11, 2021