నిరుద్యోగంపై రేవంత్ ఫైర్.. దద్దరిల్లిన స్టేజ్

దిశ, వెబ్‌డెస్క్ : టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గాంధీ భవన్ వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో లక్ష 7వేల ఖాళీలుంటే.. తాజాగా పీఆర్సీ బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో లక్ష 91వేల ఖాళీలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ నిజంగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఉద్యోగ ఖాళీలు ఎందుకు పెరిగాయని అన్నారు. తెలంగాణ వచ్చినప్పటికీ ఇంత వరకు ఉద్యమకారుల మీద కేసులు […]

Update: 2021-07-07 05:12 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గాంధీ భవన్ వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో లక్ష 7వేల ఖాళీలుంటే.. తాజాగా పీఆర్సీ బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో లక్ష 91వేల ఖాళీలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ నిజంగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఉద్యోగ ఖాళీలు ఎందుకు పెరిగాయని అన్నారు. తెలంగాణ వచ్చినప్పటికీ ఇంత వరకు ఉద్యమకారుల మీద కేసులు తొలగించలేదని విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలకు పట్టుకున్న గులాబీ చీడను తరిమికొట్టాలని అన్నారు. ఉద్యమకారుడు అని చెప్పుకునే కేసీఆర్.. తెలంగాణను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ తల్లిని కేసీఆర్ ఫామ్ హౌసులో దాచిపెట్టాడు : రేవంత్ రెడ్డి

 

Tags:    

Similar News