ఆయన మా పార్టీలో చేరడం సంతోషం : రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ ప్రెసిండెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం టీపీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ తల్లిని మనం ఎవరం కూడా చూడలేదని, మనల్ని, మన కష్టాలు చూసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే తెలంగాణ తల్లి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా.. సోనియాగాంధీకి గుడి కట్టి పూజించాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 60 ఏండ్ల కళను సాకారం చేసి.. తెలంగాణ […]
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ ప్రెసిండెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం టీపీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ తల్లిని మనం ఎవరం కూడా చూడలేదని, మనల్ని, మన కష్టాలు చూసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే తెలంగాణ తల్లి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా.. సోనియాగాంధీకి గుడి కట్టి పూజించాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 60 ఏండ్ల కళను సాకారం చేసి.. తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని అన్నారు. అమర వీరుల కుటుంబాలు సమాధుల్లోకి వెళితే.. తెలంగాణ వ్యతిరేకులు పదవులతో గద్దెనెక్కారని అన్నారు. రాహుల్ గాంధీ లాంటి నాయకుడు మనల్ని నడిపించడానికి ఉన్నారని అన్నారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తోన్న తనను ఆశీర్వదించడానికి వచ్చిన అతిరథ మహారథులతో పాటు వరుణ దేవుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభసూచికం, ఆనందం అన్నారు.
రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో లక్షా 7 వేల ఖాళీలుంటే.. తాజాగా పీఆర్సీ బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో లక్ష 91 వేల ఖాళీలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ నిజంగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఉద్యోగ ఖాళీలు ఎందుకు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చినప్పటికీ ఇంత వరకు ఉద్యమకారుల మీద కేసులు తొలగించలేదని విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలకు పట్టుకున్న గులాబీ చీడను తరిమికొట్టాలని అన్నారు. ఉద్యమకారుడు అని చెప్పుకునే కేసీఆర్.. తెలంగాణను దోచుకుంటున్నారని ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను పెట్టుకోవాలని చాలామంది సలహాలు ఇస్తున్న విషయాన్ని రేవంత్ రెడ్డి బయటపెట్టారు. తమకు పీకేలు అవసరం లేదని, తమ కార్యకర్తలే మాకు పీకేలని తెలిపారు. ప్రతికార్యకర్త ఒక పీకేలా పనిచేసి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తారని రేవంత్ తెలిపారు. ఏకెల్లాంటి కార్యకర్తలుండగా… పీకె ఎందుకు..? అని ప్రశ్నించారు. పీకే తమకు అవసరం లేదని రేవంత్ చెప్పారు.