సైలెంట్‌గా రాజధానికి వచ్చిన రేవంత్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

దిశ, చండూరు: కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ప్రకటించడంతో మునుగోడు కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ పెరిగింది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్‌రెడ్డితో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నా.. నియోజకవర్గ క్యాడర్ రేవంత్ రెడ్డికే జై కొడుతోంది. బుధవారం టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడ్డంకులు సృష్టించినా.. కాంగ్రెస్ క్యాడర్ మాత్రం సైలెంట్‌గా రాజధానికి చేరుకొని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనట్లు తెలుస్తోంది. […]

Update: 2021-07-08 08:32 GMT

దిశ, చండూరు: కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ప్రకటించడంతో మునుగోడు కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ పెరిగింది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్‌రెడ్డితో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నా.. నియోజకవర్గ క్యాడర్ రేవంత్ రెడ్డికే జై కొడుతోంది. బుధవారం టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడ్డంకులు సృష్టించినా.. కాంగ్రెస్ క్యాడర్ మాత్రం సైలెంట్‌గా రాజధానికి చేరుకొని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనట్లు తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాల కేడర్ ఆడంబరాలు చేయకుండా, పేపర్ ప్రకటనలు ఇవ్వకుండా పెద్ద ఎత్తున సొంత ఖర్చులతో తరలివెళ్లారు. మునుగోడు నియోజకవర్గాన్ని గతంలో మాజీమంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబం తన ఆధీనంలో ఉంచుకున్న తర్వాత కోమటిరెడ్డి వర్గం ప్రస్తుతం తన ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ ఆవిర్భావించిన నాటినుంచి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకత్వ లోపం ఏర్పడటంతో ఇన్నాళ్లు కేడర్ అసంతృత్తిగా ఉన్నది. ఒక్కసారిగా డైనమిక్ లీడర్, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతల్లో, కార్యకర్తల్లో హర్షాతిరేకలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగానే కోమటిరెడ్డి అడ్డా అయిన మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ కేడర్‌ కూడా రేవంత్ ఎంపికపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి ఆదేశాలు పక్కనపెట్టి పెద్ద ఎత్తున సైలెంట్‌గా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సొంత ఖర్చులతో రాజధానికి తరలివెళ్లారు. అటు కోమటిరెడ్డి, ఇటు పాల్వాయి వర్గాలను పక్కనపెట్టి కొత్తవారికి మునుగోడు నియోజకవర్గంలో నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పి కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి రేవంత్ అనుచర వర్గం పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాల్వాయి, కోమటిరెడ్డి వర్గాల్లో నాయకుల మధ్య ఉన్నప్పటికీ క్యాడర్లో మాత్రం పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కేడర్‌ పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News