అధికారంలోకి వస్తాం.. ఆ పోలీసులను విడిచిపెట్టం: రేవంత్ రెడ్డి

దిశ, నాగార్జునసాగర్: సాగర్‌ ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ వెంటే నడుస్తున్న పోలీసులను విడిచిపెట్టమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నందికొండ మున్సిపాలిటీలో మాణిక్కం ఠాకూర్, జానారెడ్డితో కలిసి పర్యటించిన ఆయన.. హిల్ కాలనీ బస్టాండ్ సెంటర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ స్ఫూర్తితో ఏర్పడిన తెలంగాణ.. అదే విధంగా పరిపాలన జరగాలని ఆశించామన్నారు. కానీ, కేసీఆర్ పూర్తిగా అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా రాజకీయాలు చేశారని ఆరోపించారు. […]

Update: 2021-04-14 07:17 GMT

దిశ, నాగార్జునసాగర్: సాగర్‌ ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ వెంటే నడుస్తున్న పోలీసులను విడిచిపెట్టమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నందికొండ మున్సిపాలిటీలో మాణిక్కం ఠాకూర్, జానారెడ్డితో కలిసి పర్యటించిన ఆయన.. హిల్ కాలనీ బస్టాండ్ సెంటర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ స్ఫూర్తితో ఏర్పడిన తెలంగాణ.. అదే విధంగా పరిపాలన జరగాలని ఆశించామన్నారు. కానీ, కేసీఆర్ పూర్తిగా అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా రాజకీయాలు చేశారని ఆరోపించారు. దళితులకు భూములు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చివరకు మోసం చేశారని విమర్శించారు.

ఈ పదేండ్ల పాటు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని గుర్తు చేసిన ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని జోస్యం చెప్పారు. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ గెలిచేందుకు పోలీసులు సాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్న పోలీసులను.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విడిచిపెట్టేది లేదన్నారు. అధికార పార్టీ అక్రమాలను గమనించిన ప్రజలు సాగర్‌ నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యంగా దళితులు.. మాయ మాటలతో మభ్య పెడుతున్న కేసీఆర్‌ను వీడి.. జానారెడ్డికి అండగా నిలవాలన్నారు.

Tags:    

Similar News