వ్యవసాయశాఖలో 61ఏళ్లకు పదవీ విరమణ

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ లోని ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసును 61ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీఓను విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 31 నుంచి ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ పరిధిలోని గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, సంఘాలు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, ఇతర సంస్థల్లో విధులు నిర్వహించే ఉద్యోగులందరికి ఈ జీఓ వర్తిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు […]

Update: 2021-04-30 08:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ లోని ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసును 61ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీఓను విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 31 నుంచి ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ పరిధిలోని గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, సంఘాలు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, ఇతర సంస్థల్లో విధులు నిర్వహించే ఉద్యోగులందరికి ఈ జీఓ వర్తిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును 61ఏళ్లకు పెంచారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..