ఏపీలో రిటైర్డ్ ఉద్యోగులకు భారీ షాక్..!
దిశ, వెబ్ డెస్క్: రిటైర్డ్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మార్చి నెలలో ఫించన్ అందుకున్న పలువురు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌లో భారీ కోతలు విధించింది. ఆదాయపన్ను చెల్లింపుల పేరుతో ట్రెజరీ కోత పెట్టింది. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయపన్ను నిమిత్తం ప్రతీ ఏడాది ఇలాంటి కోత ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు సేవింగ్స్ క్లెయిమ్స్ ఇవ్వకపోవడం వల్ల కోత విధింపు ఎక్కువగా ఉండొచ్చని […]
దిశ, వెబ్ డెస్క్: రిటైర్డ్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మార్చి నెలలో ఫించన్ అందుకున్న పలువురు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌లో భారీ కోతలు విధించింది. ఆదాయపన్ను చెల్లింపుల పేరుతో ట్రెజరీ కోత పెట్టింది. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయపన్ను నిమిత్తం ప్రతీ ఏడాది ఇలాంటి కోత ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు సేవింగ్స్ క్లెయిమ్స్ ఇవ్వకపోవడం వల్ల కోత విధింపు ఎక్కువగా ఉండొచ్చని అంటున్నారు. అయితే సేవింగ్స్‌కు సంబంధించిన క్లెయిమ్‌లను పంపినా తమకు చేరలేదంటూ ట్రెజరీ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని రిటైర్డ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇంకా జమ చేయని డీఏ బకాయిలను కూడా కలిపేసి ఇన్‌కమ్ టాక్స్ లెక్కలు వేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోండంటూ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారంటూ రిటైర్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.