తిరిగి డ్యూటీల్లోకి ఆర్మీ రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్స్

న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం విధుల నుంచి రిటైరైన ఆర్మీ మెడికల్ ఆఫీసర్లు తిరిగి దేశానికి సేవలను అందించనున్నారు. దేశం కొవిడ్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో 2 సంవత్సరాల క్రితం విధుల నుంచి పదవీ విరమణ పొందిన మెడికల్ ఆఫీసర్ల సేవలను వినియోగించుకోవాలని ఆర్మీ నిర్ణయించినట్టు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ ప్రధాని మోడీకి తెలిపారు. దేశంలో కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేటందుకు ఆర్మీ చేపడుతున్న చర్యలపై సోమవారం మోడీ.. రావత్ తో చర్చలు జరిపారు. […]

Update: 2021-04-26 10:53 GMT

న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం విధుల నుంచి రిటైరైన ఆర్మీ మెడికల్ ఆఫీసర్లు తిరిగి దేశానికి సేవలను అందించనున్నారు. దేశం కొవిడ్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో 2 సంవత్సరాల క్రితం విధుల నుంచి పదవీ విరమణ పొందిన మెడికల్ ఆఫీసర్ల సేవలను వినియోగించుకోవాలని ఆర్మీ నిర్ణయించినట్టు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ ప్రధాని మోడీకి తెలిపారు. దేశంలో కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేటందుకు ఆర్మీ చేపడుతున్న చర్యలపై సోమవారం మోడీ.. రావత్ తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆర్మీ చేపడుతున్న చర్యలను రావత్ వివరించారు. దేశంలోని ఆస్పత్రులలో వైద్య సిబ్బంది కొరత ఎదుర్కొంటున్న తరుణంలో రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్లు వారికి కొంత భారాన్ని తగ్గించనున్నారు.

Tags:    

Similar News