‘దిశ’ కథల పోటీల ఫలితాలు.. విజేతల వివరాలు ఇవే..
‘దిశ’ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కథల పోటీకి తమ రచనలను పంపించినవారందరికీ ధన్యవాదాలు. దాదాపు 125 మంది రచయితలు తమ కథలను పంపించారు. వాటన్నింటిని ‘దిశ’ న్యాయనిర్ణేతల మండలి క్షుణ్ణంగా పరిశీలించింది. నలుగురు విజేతలను ఎంపిక చేసింది. మరో నాలుగు కథలను కన్సోలేషన్ బహుమతులకు ప్రతిపాదించింది. విజేతలందరికీ అభినందనలు. ఈ కథలన్నింటినీ ‘దిశ’ వెబ్‌సైట్‌లోనూ, సాహితీ సౌరభం పేజీలోనూ వరుసగా ప్రచురిస్తాం. మొదటి బహుమతి (రూ. 5,000) : బిచ్చగాడు రచయిత: ముసునూరి సుబ్బయ్య, నిజాంపేట, హైదరాబాద్ రెండవ […]
‘దిశ’ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కథల పోటీకి తమ రచనలను పంపించినవారందరికీ ధన్యవాదాలు. దాదాపు 125 మంది రచయితలు తమ కథలను పంపించారు. వాటన్నింటిని ‘దిశ’ న్యాయనిర్ణేతల మండలి క్షుణ్ణంగా పరిశీలించింది. నలుగురు విజేతలను ఎంపిక చేసింది. మరో నాలుగు కథలను కన్సోలేషన్ బహుమతులకు ప్రతిపాదించింది. విజేతలందరికీ అభినందనలు. ఈ కథలన్నింటినీ ‘దిశ’ వెబ్‌సైట్‌లోనూ, సాహితీ సౌరభం పేజీలోనూ వరుసగా ప్రచురిస్తాం.
మొదటి బహుమతి (రూ. 5,000) : బిచ్చగాడు
రచయిత: ముసునూరి సుబ్బయ్య, నిజాంపేట, హైదరాబాద్
రెండవ బహుమతి (రూ. 3,000) : చదువెందుకు నాన్నా
రచయిత: ఎం రాజేశ్‌ఖన్నా, పుణే, మహారాష్ట్ర
మూడవ బహుమతి (రూ. 2,000) : గురుదక్షిణ
రచయిత: తురుమళ్ల కళ్యాణి, భద్రాద్రి కొత్తగూడెం
జ్యూరీ స్పెషల్ అవార్డు (రూ. 1000) : పరిహారం
రచయిత: మహబూబ్ బాషా, అదోనీ
కన్సోలేషన్ బహుమతులు
1. త్రీ ఇడియట్స్
రచయిత: మేరీ కృపాబాయి, చిలకలపూడి, మచిలీపట్నం
2. వంకలు, చంద్రవంకలు
రచయిత: డా. బుద్ధిరాజు రమణశ్రీ, బెంగళూరు
3. ఊతం
రచయిత: కామరాజుగడ్డ వాసవదత్త రమణ, కేపీహెచ్‌బీ కాలనీ, హైదరాబాద్
4. కట్టుబాట్లు
రచయిత: జయంతి వాసరచెట్ల, హైదరాబాద్
- 02-10-2021 శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని మా ప్రధాన కార్యాలయంలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. విజేతలు వీలు కల్పించుకుని హాజరు కాగలరని మనవి.