నేటి నుండి గూడ్స్ వాహనాలపై ఆంక్షలు
దిశ, మంచిర్యాల: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో కొవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ ను సమర్థవంతంగా అమలు చేయడానికి నేటి నుండి గూడ్స్ వాహనాల లోడింగ్, అన్‌లోడ్ కోసం అన్ని కదలికలను రాత్రి 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు మాత్రమే అనుమతించబడుతుందని పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటల నుండి […]
దిశ, మంచిర్యాల: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో కొవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ ను సమర్థవంతంగా అమలు చేయడానికి నేటి నుండి గూడ్స్ వాహనాల లోడింగ్, అన్‌లోడ్ కోసం అన్ని కదలికలను రాత్రి 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు మాత్రమే అనుమతించబడుతుందని పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ తెలిపారు.
ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య ఎటువంటి గూడ్స్ వాహనాలు అనుమతించబడవన్నారు. ఆక్సిజన్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్, క్యారింగ్ వెహికల్స్, ఆక్సిజన్ ట్యాంకర్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్, వాటర్ సప్లై వెహికల్స్ తో పాటు రైతుల వద్ద నుండి ధాన్యం నింపుకొని వచ్చే వాహనాలకు ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని, లాక్ డౌన్ సమయంలో కూడా యధావిధిగా నడుస్తాయని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడించారు.