వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరంచుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమబెంగాల్ అసెంబ్లీ మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసింది. గురువారం తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య అసెంబ్లీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్థ ఛటర్జీ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకల్ వెల్‌లోకి దూసుకువచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ చట్టాలపై ప్రజలను పక్కదారి పట్టించేలా తప్పుడు ప్రచారం ప్రారంభించిందని ఆరోపించారు. కొద్దిసేపటి తర్వాత […]

Update: 2021-01-28 08:52 GMT

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరంచుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమబెంగాల్ అసెంబ్లీ మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసింది. గురువారం తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య అసెంబ్లీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్థ ఛటర్జీ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకల్ వెల్‌లోకి దూసుకువచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ చట్టాలపై ప్రజలను పక్కదారి పట్టించేలా తప్పుడు ప్రచారం ప్రారంభించిందని ఆరోపించారు.

కొద్దిసేపటి తర్వాత జై శ్రీరాం నినాదాలు చేస్తూ బీజేపీ శాసనసభ పక్ష నేత మనోజ్ టిగ్గ, ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సీఎం మమతా బెనర్జీ సూచించారు. చట్టాల ఉపసంహరణపై చర్చించడం కోసం ప్రధాన నరేంద్ర మోడీ అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను మేం వ్యతిరేకిస్తున్నాం. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని కోరుతున్నాం. గతంలో కార్పొరేట్ రుణాలను మాఫీ చేశారు. అలాగే, రైతుల రుణాలను కూడా మాఫీ చేయాలని సీఎం మమతా బెనర్జీ కోరారు. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన హింస గురించి మాట్లాడుతూ ఇది పూర్తిగా ఇంటెలలిజెన్స్ విఫలంగా పేర్కొన్నారు. రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించడం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. కర్షకులు జాతి సంపదగా అభివర్ణించారు.

Tags:    

Similar News