కుక్కల నుంచి మరో కొత్త వైరస్

దిశ, ఫీచర్స్ : ఏడాదిన్నర కాలంగా ‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా ఈ మహమ్మారికి తోడు బ్లాక్, వైట్ ఫంగస్‌లు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘శునకాల’ నుంచి ఓ కొత్త రకం వైరస్ వస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. 2017-2018లో న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరిన రోగులపై అధ్యయనం జరపగా.. కుక్కలలో ఉద్భవించిన ఓ కొత్త రకం కరోనా వైరస్ లాగే వ్యాధిన బారినపడ్టట్లు తాజాగా పరిశోధకులు కనుగొన్నారు. క్లినికల్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ జర్నల్‌లో గురువారం ప్రచురించిన […]

Update: 2021-05-22 04:24 GMT

దిశ, ఫీచర్స్ : ఏడాదిన్నర కాలంగా ‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా ఈ మహమ్మారికి తోడు బ్లాక్, వైట్ ఫంగస్‌లు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘శునకాల’ నుంచి ఓ కొత్త రకం వైరస్ వస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.

2017-2018లో న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరిన రోగులపై అధ్యయనం జరపగా.. కుక్కలలో ఉద్భవించిన ఓ కొత్త రకం కరోనా వైరస్ లాగే వ్యాధిన బారినపడ్టట్లు తాజాగా పరిశోధకులు కనుగొన్నారు. క్లినికల్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ జర్నల్‌లో గురువారం ప్రచురించిన ఈ అధ్యయనంలో తమ పరిశోధనలు జంతు కరోనావైరస్‌ల కారణంగా ప్రజారోగ్యానికి ఖచ్చితంగా ముప్పు ఉందని పరిశోధకులు చెప్పారు.

తూర్పు మలేషియా రాష్ట్రమైన సారావాక్‌లోని ఒక ఆసుపత్రిలో 301 న్యుమోనియా రోగుల నుంచి తీసుకున్న ‘నాసల్ స్వాబ్’ నమూనాలను ఆ అధ్యయనం కోసం పరీక్షించినట్లు పరిశోధకులు తెలిపారు. ఎనిమిది శాంపిల్స్‌లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో కెనైన్ కరోనావైరస్ పాజిటివ్‌గా వచ్చాయి. CCoV-HuPn-2018 అని పిలిచే ఈ కొత్త జాతి కరోనా వైరస్ పిల్లులు, పందులకు సోకిన ఇతర కరోనావైరస్ లక్షణాలతో సమానంగా ఉన్కట్లు తేలింది. ఇది మ్యుటేషన్ కూడా కలిగి ఉంది. అయితే ఈ వైరస్ ఇప్పటికే తెలిసిన ‘కెనైన్ కరోనావైరస్‌’లో కనిపించలేదు కానీ, COVID-19 వైరస్ అయిన SARS-COV, SARS-COV-2 వంటి మానవ జాతులలో ఉంది. SARS-COV-2 కరోనావైరస్ మూలం జంతువు లేదా అనే విషయం కూడా ఇప్పటికీ అస్పష్టంగా ఉంది.

ఈ వైరస్ ఇటీవల జంతువుల నుంచి మానవులకు సోకిందని పరిశోధనలు సూచించాయి. అయితే ఇది ప్రజల మధ్య వ్యాప్తి చెందుతుందో లేదో తెలుసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమంటున్నారు వైద్యులు. ఈ వైరస్ ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తుందా లేదా అనేది కూడా అస్పష్టంగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

మానవులలో వ్యాధికి కారణమయ్యే ఏడు కరోనావైరస్‌లు ఉండగా.. అందులో నాలుగు( 229E – ఆల్ఫా కరోనావైరస్, NL63-ఆల్ఫా కరోనావైరస్, OC43-బీటా కరోనావైరస్, HKU1-బీటా కరోనావైరస్) జలుబుకు కారణమవుతాయి. మరో మూడు సాధారణంగా SARS, MERS, COVID-19 వంటి వ్యాధులకు కారణమవుతాయి.

Tags:    

Similar News