మహిళల మేకప్‌ తో గర్భం, పిండంలో ప్లాస్టిక్..?

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలామందికి 2020 ఒక చీకటి సంవత్సరం. మరికొందరైతే మహమ్మారి పీడించిన ఈ సంవత్సరాన్ని మునుపెన్నడూ చూడనంత చెత్త సంవత్సరం గా అభివర్ణిస్తున్నారు. 2020 లో కరోనా ప్రపంచ దేశాలకు చెందిన ఎంతోమందిన పొట్టనబెట్టుకుంది. డిసెంబర్ 24నాటికి ప్రపంచ వ్యాప్తంగా 78.7 మిలియన్ల మందికి కరోనా సోకగా, 44.3 మిలియన్ల మంది కోలుకున్నారు. వైరస్ ధాటికి 1.73మిలియన్ల మంది ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. ఇక వైరస్ తన ఆకారాన్ని మార్చుకోవడంతో కరోనా భయం […]

Update: 2020-12-24 02:14 GMT

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలామందికి 2020 ఒక చీకటి సంవత్సరం. మరికొందరైతే మహమ్మారి పీడించిన ఈ సంవత్సరాన్ని మునుపెన్నడూ చూడనంత చెత్త సంవత్సరం గా అభివర్ణిస్తున్నారు. 2020 లో కరోనా ప్రపంచ దేశాలకు చెందిన ఎంతోమందిన పొట్టనబెట్టుకుంది.

డిసెంబర్ 24నాటికి ప్రపంచ వ్యాప్తంగా 78.7 మిలియన్ల మందికి కరోనా సోకగా, 44.3 మిలియన్ల మంది కోలుకున్నారు. వైరస్ ధాటికి 1.73మిలియన్ల మంది ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. ఇక వైరస్ తన ఆకారాన్ని మార్చుకోవడంతో కరోనా భయం రోజురోజుకు పెరిగిపోతుంది. ఇంతటి విపత్కర పరిస్థితులకు కారణమైన 2020 మరో బ్యాడ్ న్యూస్ తో ముందుకు వచ్చింది.

ఆరోగ్యంగా ఉన్న ప్రెగ్నెన్సీ మహిళల గర్భంలో, పిండంలో చిన్న చిన్న ప్లాస్టిక్స్ కణాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించడంతో ఈ అంశం మరింత ఆందోళన కలిగిస్తోంది. డాక్టర్లు గుర్తించిన ఈ ప్లాస్టిక్ కణాలు బంగారం, నీలం, ఎరుపు, గులాబీ రంగుల్లో ఉన్నట్లు గుర్తించారు. అయితే గర్భిణీ స్త్రీలు, పిండాల్లో ఈ ప్లాస్టిక్ కణాలు ఎలా వచ్చాయనే అంశంపై పరిశోదనలు చేయగా.., పరిశోధనల్లో మహిళలు వేసుకునే మేకప్ తో పాటు శరీర సంరక్షణ కోసం వినియోగించే పర్సనల్ కేర్ ప్రాడక్ట్ నుంచి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించారు.

ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్ కథనం ప్రకారం.., ఈ ప్లాస్టిక్ కణాలు గర్భధారణ సమయంలో యాంటీబాడీస్, ఇంప్లాంటేషన్ సమయంలో పిండం పెరుగుదల , సిగ్నలింగ్, తల్లికి పిండానికి కమ్యూనికేషన్‌ను నియంత్రించే విలక్షణమైన కెమోకిన్ గ్రాహకాల యొక్క విధులు, పిండం మరియు గర్భాశయం మధ్య సిగ్నలింగ్, ఒక్కో కణం మరికొన్ని కణాలుగా కలిసే మార్గాలలో ఈ మైక్రోపార్టికల్స్ తయారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సాధారణ గర్భధారణ సమయంలో గర్భాశయ డెన్డ్రిటిక్ కణాలు, సహజ కిల్లర్ కణాలు, టి- కణాలు మరియు మాక్రోఫేజ్‌ల రవాణా తదితర ప్రభావాలన్నీ ప్రీక్లాంప్సియా మరియు పిండం పెరుగుదల పరిమితితో సహా గర్భం రాకుండా అడ్డుకున్నట్లు గుర్తించారు.

అయితే మైక్రోప్లాస్టిక్స్ రోగనిరోధక ప్రతిస్పందనలను ప్రేరేపిస్తుందా? లేదా విషపూరిత కలుషితాల్ని విడుదల చేస్తుందా? అని అంచనా వేసేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్ లో పేర్కొంది.

Tags:    

Similar News