గోవుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి

దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌లో గోవుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీ అంజనీకుమార్‌ను కలిసి టీటీడీ బోర్డు మెంబర్ శివకుమార్ గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఎవరైనా గోవులను హత్య చేస్తే ఎనిమల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూవులకు గోవు చాలా పవిత్రమైందన్నారు. బక్రీదు పండుగ పురస్కరించుకుని గోవధ నిషేద చట్టం అమలు చేయాలన్నారు. ప్రగతి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో […]

Update: 2020-07-30 06:44 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌లో గోవుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీ అంజనీకుమార్‌ను కలిసి టీటీడీ బోర్డు మెంబర్ శివకుమార్ గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఎవరైనా గోవులను హత్య చేస్తే ఎనిమల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూవులకు గోవు చాలా పవిత్రమైందన్నారు. బక్రీదు పండుగ పురస్కరించుకుని గోవధ నిషేద చట్టం అమలు చేయాలన్నారు.

ప్రగతి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మొదటిగా గోమాతనే తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. ఆవులను వధించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదన్నారు. హైదరాబాద్ నగరంలో ఈ రెండు మూడు రోజుల్లో అనేక ఆవులను వధించడానికి నగరానికి తీసుకొచ్చినట్లు సమాచారం ఉన్నట్టు తెలిపారు. బక్రీద్ పండుగ రోజు ఆవులను వధించకుండా సమావేశం ఏర్పాటు చేసి సందేశం ఇవ్వాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి శివకుమార్ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News