రెమిడెసివిర్ మీరే కొనుక్కోండి.. ఇకపై మేము ఇవ్వలేం : కేంద్రం
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే వ్యాక్సిన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కొనుక్కోవాలని చెప్పిన కేంద్రం, తాజాగా కొవిడ్ రోగుల పరిస్థితి విషమించకుండా అందించే రెమిడెసివిర్ ఇంజెక్షన్లను ఇకపై తాము అందించబోమని.. మీరే కొనుక్కోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో రెమిడెసివిర్ ఉత్పత్తి 10రేట్లు పెరిగిందని కేంద్రం వెల్లడించింది. ఇండియాలో రెమిడెసివిర్ […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే వ్యాక్సిన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కొనుక్కోవాలని చెప్పిన కేంద్రం, తాజాగా కొవిడ్ రోగుల పరిస్థితి విషమించకుండా అందించే రెమిడెసివిర్ ఇంజెక్షన్లను ఇకపై తాము అందించబోమని.. మీరే కొనుక్కోవాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో రెమిడెసివిర్ ఉత్పత్తి 10రేట్లు పెరిగిందని కేంద్రం వెల్లడించింది. ఇండియాలో రెమిడెసివిర్ నిల్వలు చాలినంత ఉన్నాయని, డిమాండ్ కంటే అధికంగా రెమిడెసివిర్ సరఫరా జరుగుతోందని కేంద్రం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.