రెమ్‌డెసివిర్ ధరపై అప్రమత్తంగా ఉండాలి

న్యూఢిల్లీ: రెమ్‌డెసివిర్ డ్రగ్‌ను ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు కొందరు అమ్ముతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న పేషెంట్లకు అత్యవసర పరిస్థితుల్లో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ మందు ఇచ్చేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో) అనుమతించిందని తెలిపింది. కొరత ఏర్పడకుండా జాగ్రత్త తీసుకునే క్రమంలో ఈ డ్రగ్‌ను మనదేశంలోనే తయారు చేసి మార్కెటింగ్ చేయడానికి సిప్లా, హెటిరో, మైలాన్ ల్యాబరేటరీలకు అనుమతిచ్చారని […]

Update: 2020-07-07 11:18 GMT

న్యూఢిల్లీ: రెమ్‌డెసివిర్ డ్రగ్‌ను ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు కొందరు అమ్ముతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న పేషెంట్లకు అత్యవసర పరిస్థితుల్లో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ మందు ఇచ్చేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో) అనుమతించిందని తెలిపింది. కొరత ఏర్పడకుండా జాగ్రత్త తీసుకునే క్రమంలో ఈ డ్రగ్‌ను మనదేశంలోనే తయారు చేసి మార్కెటింగ్ చేయడానికి సిప్లా, హెటిరో, మైలాన్ ల్యాబరేటరీలకు అనుమతిచ్చారని పేర్కొంది. అయినప్పటికీ ఈ డ్రగ్‌ను బ్లాక్ మార్కెట్‌లో ఎంఆర్‌పీకి మించిన ధరకు అమ్ముతున్నారని కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, బ్లాక్ మార్కెట్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి అడ్డుకోవాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్(I) డాక్టర్ వీజీ సోమని తెలిపారు. అలాగే, ఆ సమాచారాన్ని సీడీఎస్‌సీవోకు అందించాలని సూచించారు.

Tags:    

Similar News