ఎంగేజ్మెంట్ తరువాత పెండ్లికి నిరాకరించిన వ్యక్తికి రిమాండ్
దిశ, కూకట్పల్లి: ఎంగేజ్మెంట్ జరిగిన తరువాత మరింత కట్నం ఇస్తేనే పెండ్లి చేసుకుంటానని మోసానికి పాల్పడిన వ్యక్తిపై బాధితుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని శనివారం రిమాండ్‌కు కేపీహెచ్‌బీ పోలీసులు తరలించారు. కర్నూల్ జిల్లా కోయిల్కుంట్ల సౌదరదిన్నే ప్రాంతానికి చెందిన యారాసి సౌమ్య (29) కుటుంబం గత కొన్ని ఏండ్ల నుంచి కేపీహెచ్‌బీకాలనీ రోడ్డు నంబర్ 2లోని ఎస్దా అహ్లాద రెసిడెన్సిలో నివాసం ఉంటున్నారు. సౌమ్య తండ్రి శ్రీనివాస్ రెడ్డి కొన్ని ఏండ్ల క్రితం మృతి చెందారు. […]
దిశ, కూకట్పల్లి: ఎంగేజ్మెంట్ జరిగిన తరువాత మరింత కట్నం ఇస్తేనే పెండ్లి చేసుకుంటానని మోసానికి పాల్పడిన వ్యక్తిపై బాధితుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని శనివారం రిమాండ్‌కు కేపీహెచ్‌బీ పోలీసులు తరలించారు. కర్నూల్ జిల్లా కోయిల్కుంట్ల సౌదరదిన్నే ప్రాంతానికి చెందిన యారాసి సౌమ్య (29) కుటుంబం గత కొన్ని ఏండ్ల నుంచి కేపీహెచ్‌బీకాలనీ రోడ్డు నంబర్ 2లోని ఎస్దా అహ్లాద రెసిడెన్సిలో నివాసం ఉంటున్నారు. సౌమ్య తండ్రి శ్రీనివాస్ రెడ్డి కొన్ని ఏండ్ల క్రితం మృతి చెందారు. ఇదిలా ఉండగా ఈఎన్టీ డాక్టర్‌గా పని చేస్తున్న యారాసి సౌమ్య కోసం ఆమె తల్లి వివాహ సంబంధాలు చూసే క్రమంలో తెలుగు మ్యాట్రిమోనిలో కేపీహెచ్‌బీకాలనీ రోడ్డు నంబర్ 3లో నివాసం ఉంటున్న కెనెరా బ్యాంక్ మేనేజర్ దుబ్బా మనోజ్ కుమార్ రెడ్డి(30) సంబంధం కుదిరింది.ః
దీంతో జూన్ 6వ తేదిన ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ క్రమంలో దుబ్బా మనోజ్ కుమార్ రెడ్డికి కట్నం కింద 5 ఎకరాల భూమి, 25 లక్షల విలువ గల ప్లాట్, 40 గులాల బంగారం, 3 లక్షల రూపాయల నగదు కట్నం కింద ఇవ్వడానికి ఒప్పకున్నారు. ఈ క్రమంలో సౌమ్య కుటుంబ సభ్యులు మనోజ్ కుమార్ రెడ్డికి 50 వేల రూపాయలు వస్త్రాలు కొనుగోలుకు అందజేశారు. అంతే కాకుండా మనోజ్ పుట్టినరోజు సందర్భంగా సౌమ్య జూన్ 24న పది వేల రూపాయాల ఖరీదైన వాచి బహుమతిగా ఇచ్చింది. ఇదిలా ఉండగా సౌమ్య కుటుంబ సభ్యులు పెండ్లి పనులలో బిజీగా ఉంటూ 25వ తేదిన మనోజ్ కుమార్ తల్లి తండ్రులు చంద్రారెడ్డి, లలితమ్మ ఫోన్ చేసి తమ కొడుకు పెండ్లి సౌమ్యతో చేయడానికి ఇష్టంగా లేమని, అదనంగా మరో 5 ఎకరాల భూమి ఇస్తేనే పెండ్లి చేస్తామని చెప్పారు. దీంతో సౌమ్య శుక్రవారం కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు దుబ్బా మనోజ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.