వైద్య సామగ్రి కోసం చైనాకు విమానాలు..రిలయన్స్ చర్చలు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీ జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సాయంతో చైనా నుంచి వైద్య సంబంధ వస్తువులను తెప్పించేందుకు చర్చలు జరుపుతోంది. చైనాలో ఇటీవల సాధారణ పరిస్థితులు ఏర్పడి ఉత్పత్తి మొదలైన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ఆ దేశంలో ఎక్కువ కంపెనీలు మాస్కుల వంటి ఆరోగ్య రక్షణ వస్తువులను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ సంస్థ […]

Update: 2020-04-02 05:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీ జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సాయంతో చైనా నుంచి వైద్య సంబంధ వస్తువులను తెప్పించేందుకు చర్చలు జరుపుతోంది. చైనాలో ఇటీవల సాధారణ పరిస్థితులు ఏర్పడి ఉత్పత్తి మొదలైన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ఆ దేశంలో ఎక్కువ కంపెనీలు మాస్కుల వంటి ఆరోగ్య రక్షణ వస్తువులను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన 10 విమానాలను నడిపి శానిటైజర్, మాస్కులు వంటి వైద్య సంబంధ వస్తువులను తీసుకురావడానికి సిద్ధమైంది. అయితే, ఈ సరుకుల రవాణాకు సంబంధించి ఛార్జీల విషయంలో ఇంకా చర్చలు జరపలేదు. ప్రస్తుత సమయంలో అత్యవసరమైన వస్తువులే ముఖ్యమని సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

రిలయన్స్ బాటలోనే మరిన్ని కంపెనీలు చైనా నుంచి వైద్య పరికరాలను దిగుమతి చేసుకోవాలనే యోచనలో ఉన్నాయి. దీనికోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో ప్రణాళికల గురించి చర్చిస్తున్నట్టు సమాచారం.

దేశీయంగా వైద్య పరికరాలమ్ను, ఇతర నిత్యావసర వస్తువులను తీసుకెళ్లడంలో ఎయిర్ ఇండియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. స్థానికంగా సరుకులను తరలించడానికి చార్టర్ విమానాలను నడుపుతోంది. చైనా నుంచి కరోనా సంబంధిత వైద్య సామాగ్రిని సరఫరా చేయబోయే మొదటి భారతీయ క్యారియర్ ఎయిర్ ఇండియానే కావడం విశేషం. చార్టర్ కార్గో విమ్మానాల నిర్వహణ కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటోంది.

కోవిడ్-19కు వ్యతిరేకంగా ఇండియా చేస్తున్న యుద్ధంలో భాగంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా, వెలుపల వైద్య, సంబంధ సామాగ్రిని తరలించేందుకు ‘లైఫ్‌లైన్ ఉడాన్’ పేరుతో విమానాలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సరుకులను రవాణా చేయడానికి ఏప్రిల్ 1 నాటికి మొత్తం 74 విమానాలను సిద్ధం చేసింది. దేశీయంగా ఇప్పటివరకూ వివిధ క్యారియర్లు మొత్తం 37.63 టన్నుల సరుకును రవాణా చేశాయి. దేశీయ కార్గొ ఆపరేటర్లు బ్లూ డార్ట్, స్పైస్‌జెక్స్‌ప్రెస్‌లు వాణిజ్య ప్రాతిపదికన కార్గో విమానాలను నడుపుతున్నాయి.

కార్గో విమానాలు ఎయిర్ ఇండియా ఖర్చుతో నడుపుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇవి నార్త్ ఈస్ట్, అండమాన్ & నికోబార్ దీవుల్లోని సుదూర ప్రాంతాలతో పాటు రాష్ట్రాలకు కూడా అవసరమైన వస్తువులను రవాణా చేస్తున్నాయి. చైనా అధికారుల నుంచి అవసరమైన రెగ్యులేటరీ ఆమోదం పొందిన తర్వాత అవసరమైన వైద్య సంబంధ వస్తువులను తీసుకురావడానికి చైనాకు విమానాలను ప్రారంభించనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కార్పొరేట్లు, ప్రముఖులు, వ్యక్తులు విరాళాలు, సహాయాలు అందిస్తున్నారు. ఈ పరిణామాలతో కరోనాకు ముందు వరకూ ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు ఊరట లభించింది. కరోనాను అధిగమించేందుకు భరోసా లభించింది.

కీ హైలైట్స్:

* చైనా నుండి కోవిడ్ -19 సంబంధిత వైద్య పరికరాల కోసం 10 చార్టర్ విమానాలను నడపడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎయిర్ ఇండియాతో చర్చలు జరుపుతోంది

* చైనా నుండి కరోనావైరస్ సంబంధిత వైద్య సామాగ్రిని భారతీయ క్యారియర్ తీసుకురావడం ఇదే మొదటిసారి

* లాక్డౌన్ సమయంలో ఇప్పటివరకు వివిధ క్యారియర్లు మొత్తం 37.63 టన్నుల సరుకును రవాణా చేశాయి.

* వైద్య, వైద్య సంబంధావసరమైన సామాగ్రి తరలింపు కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ “లైఫ్లైన్ ఉడాన్” విమానాలను ప్రారంభించింది.

* బ్లూ డార్ట్, స్పైస్‌జెక్స్‌ప్రెస్ వాణిజ్య ప్రాతిపదికన ఈ కార్గో విమానాలను నడుపుతున్నాయి.

Tags : Reliance Industries, Air India, Covid-19 Related Medical Items, Coronavirus-Relatedmedical Supplies, Civil Aviation Ministry, Blue Dart, SpicejeXpress, Covid-19 Crisis, Mukesh Ambani, Coronavirus Cases In India, Coronavirus Cases Latest Details

Tags:    

Similar News