బంపర్ ఆఫర్: రీఛార్జ్ చేసుకోండి.. రూ. 200 క్యాష్‌బ్యాక్ పొందండి
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఈ ఏడాది పండుగ సీజన్ సందర్భంగా ప్రత్యేక రీఛార్జ్ ఆఫర్‌ను బుధవారం ప్రకటించింది. ప్రీ-పెయిడ్ వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అయితే, ఈ ప్రత్యేక ఆఫర్ మూడు రీఛార్జ్ ఆఫర్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అవి రూ. 249, రూ. 555, రూ. 599 ప్లాన్‌లకు 20 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ ఆఫర్ కోసం వినియోగదారులు మై జియో యాప్, […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఈ ఏడాది పండుగ సీజన్ సందర్భంగా ప్రత్యేక రీఛార్జ్ ఆఫర్‌ను బుధవారం ప్రకటించింది. ప్రీ-పెయిడ్ వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అయితే, ఈ ప్రత్యేక ఆఫర్ మూడు రీఛార్జ్ ఆఫర్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అవి రూ. 249, రూ. 555, రూ. 599 ప్లాన్‌లకు 20 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నట్టు పేర్కొంది.
ఈ ఆఫర్ కోసం వినియోగదారులు మై జియో యాప్, జియో అధికారిక పోర్టల్ నుంచి రీఛార్జ్ చేసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుందని, ఈ రీఛార్జ్ తర్వాత జియో అకౌంట్‌లోకి క్యాష్‌బ్యాక్ మొత్తం జమ అవుతుందని, ఆ క్యాష్‌బ్యాక్‌ను తర్వాత రీఛార్జ్ కోసం వాడుకోవచ్చని రిలయన్స్ జియో వివరించింది. ఎంపిక చేసిన ప్లాన్‌లను రీఛార్జ్ చేయడం ద్వారా 20 శాతం లేదంటే గరిష్ఠంగా రూ. 200 క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ ద్వారా వచ్చిన నగదును వినియోగదారులు అక్టోబర్ 2 నుంచి జియో మార్ట్, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ డిజిటల్, జియో రీఛార్జ్, మిల్క్‌బాస్కెట్, అజియో, రిలయన్స్ ఫ్రెష్ వీటిలో ఎక్కడైనా వినియోగించే అవకాశం ఉంటుందని కంపెనీ వెల్లడించింది.