సర్కార్ సంచలన నిర్ణయం.. పత్తి రైతులకు బ్యాడ్ న్యూస్
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం కఠినమైన షరతులు విధించింది. తేమ శాతాన్ని బట్టి సొమ్ము చెల్లించాలని నిర్ణయించింది. 2021-22 సీజన్‌లో పత్తి కొనుగోలుకు సంబంధించి మార్కెటింగ్‌శాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. నవంబరు మొదటి వారం నుంచి రాష్ట్రంలోని 50 మార్కెట్‌యార్డులు, 73 జిన్నింగు మిల్లుల్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం పొడుగు పింజపత్తి క్వింటా కు రూ.6,025, మధ్యస్త పింజపత్తికి రూ.5,725గా ఎమ్మెస్పీగా […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం కఠినమైన షరతులు విధించింది. తేమ శాతాన్ని బట్టి సొమ్ము చెల్లించాలని నిర్ణయించింది. 2021-22 సీజన్‌లో పత్తి కొనుగోలుకు సంబంధించి మార్కెటింగ్‌శాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. నవంబరు మొదటి వారం నుంచి రాష్ట్రంలోని 50 మార్కెట్‌యార్డులు, 73 జిన్నింగు మిల్లుల్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం పొడుగు పింజపత్తి క్వింటా కు రూ.6,025, మధ్యస్త పింజపత్తికి రూ.5,725గా ఎమ్మెస్పీగా సర్కారు నిర్ణయించింది. పొడుగు పింజ పత్తిలో 8శాతం మించి తేమ ఉంటే ప్రతి ఒక శాతానికి రూ.60.25, మధ్యస్త పింజ పత్తికి రూ.57.26చొప్పున ధర తగ్గుతుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. 12శాతం మించి తేమ ఉంటే సీసీఐ కొనుగోలు చేయదని మార్కెటింగ్ శాఖ క్లారిటీ ఇచ్చింది.