న్యాయం చేయకపోతే చావడానికైనా సిద్ధం.. వెనక్కి తగ్గని భూనిర్వాసితులు
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో నిర్మించబోతున్న సీతమ్మ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న భూనిర్వాసితుల రిలే నిరాహారదీక్ష బుధవారానికి 147రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా భూనిర్వాసితులు మాట్లాడుతూ.. సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం భూములు ఇవ్వకుండా, అటు నష్టపరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తుందన్నారు. నిర్మాణం కింద భూములు కోల్పోయి నిర్వాసితుల కుటుంబాలు రోడ్డునపడ్డాయని ఘోషించారు. ప్రభుత్వం భూనిర్వాసితుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందన్నారు. భూముల కోసం, భూ […]
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో నిర్మించబోతున్న సీతమ్మ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న భూనిర్వాసితుల రిలే నిరాహారదీక్ష బుధవారానికి 147రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా భూనిర్వాసితులు మాట్లాడుతూ.. సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం భూములు ఇవ్వకుండా, అటు నష్టపరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తుందన్నారు. నిర్మాణం కింద భూములు కోల్పోయి నిర్వాసితుల కుటుంబాలు రోడ్డునపడ్డాయని ఘోషించారు.
ప్రభుత్వం భూనిర్వాసితుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందన్నారు. భూముల కోసం, భూ నష్టపరిహారం కోసం 147 రోజుల నుంచి రిలే నిరాహారదీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వాపోయారు. ఇస్తే భూముల ఇస్తారా.. లేక నష్టపరిహారం చెల్లిస్తారా అంటు ప్రభుత్వాన్ని నిర్వాసితులు నిలదీశారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు దీక్ష ప్రాంగణం నుండి కదిలే ప్రసక్తిలేదని తేల్చిచెప్పేశారు. భూముల కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నామని నిర్వాసితులు హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామన్నారు.