శ్రీశైలం హైవేపై మృతదేహంతో ధర్నా.. ఉద్రిక్తత వాతావరణం
దిశ, అచ్చంపేట: నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండల పరిధి వెంకటేశ్వర్ల బావి గ్రామానికి చెందిన ఎనుపోతుల పర్వతాలు (55) రోడ్డు ప్రమాదానికి గురై.. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. దీంతో మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు.. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన జాతీయ రహదారి (అంబేద్కర్ చౌరస్తా)పై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత బంధువులు మాట్లాడుతూ.. గత నెల 20వ తేదీన మాచారం […]
దిశ, అచ్చంపేట: నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండల పరిధి వెంకటేశ్వర్ల బావి గ్రామానికి చెందిన ఎనుపోతుల పర్వతాలు (55) రోడ్డు ప్రమాదానికి గురై.. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. దీంతో మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు.. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన జాతీయ రహదారి (అంబేద్కర్ చౌరస్తా)పై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత బంధువులు మాట్లాడుతూ.. గత నెల 20వ తేదీన మాచారం గ్రామ సమీపంలో వెంకటేశ్వర్ల బావి గ్రామానికి చెందిన పర్వతాలు పశువులను మేపుతున్న సమయంలో.. అమ్రాబాద్ వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనదారుడు ఢీ కొట్టాడన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో బాధితుడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ పర్వతాలు సోమవారం రాత్రి మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని జాతీయ రహదారిపై బంధువులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు.
పోలీసుల కాళ్లు మొక్కిన బాధిత బంధువులు..
ఆందోళన తీవ్రతరం కావడంతో ఒక్కసారిగా శ్రీశైలం జాతీయ రహదారిపై వాహనాలు పెద్దఎత్తున నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అచ్చంపేట సీఐలు ఆదిరెడ్డి, అనుదీప్, ఎస్సైలు వెంకటయ్య, శ్రీనివాసులు, కృష్ణ దేవ్, శిక్షణ ఎస్ఐలు, 20 మంది పోలీసు సిబ్బంది ఆందోళనకారుల వద్దకు చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మృతుడి బంధువు పోలీసుల కాళ్ల మీద పడ్డారు. పర్వతాలు చికిత్స కోసం ఇప్పటికే రూ. 12 లక్షలు ఖర్చు అయ్యాయని.. అయినా ప్రాణం నిలబడలేదని కన్నీరుపెట్టుకున్నారు. ఇప్పుడి బాధిత కుటుంబం పరిస్థితి ఏంటని వాపోయారు.
పోలీసులు-బంధువుల మధ్య వాగ్వాదం
ఒకానొక సమయంలో పోలీసులు, బంధువులకు రసాభాస జరగడంతో శిక్షణలో ఉన్న ఎస్ఐ మృతుని బంధువుపై చేయి చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వాతావరణం మరింత వేడెక్కింది. వెంటనే సీఐ ఆదిరెడ్డి జోక్యం చేసుకొని.. శిక్షణ ఎస్సైలు లా అండ్ ఆర్డర్ తెలుసుకోవాలని, సమయానుకూలంగా ఆలోచించాలని గట్టిగా మందలించారు. చివరకు పోలీసులు న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో బాధిత బంధువులు ఆందోళన విరమించారు.