నా కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసేందుకు రెక్కీ.. ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు

దిశ, ఏపీ బ్యూరో: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసేందుకు కొందరు రెక్కీ నిర్వహించారని ఆరోపించారు. ఢిల్లీలో శనివారం మీడియాతో మాట్లాడిన ఎంపీ రఘురామ తన కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ యత్నానికి సంబంధించి రెక్కీ నిర్వహించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ ఆధారాలను త్వరలోనే డీజీపీకి అందజేస్తానని స్పష్టం చేశారు. అలాగే […]

Update: 2021-11-06 08:11 GMT

దిశ, ఏపీ బ్యూరో: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసేందుకు కొందరు రెక్కీ నిర్వహించారని ఆరోపించారు. ఢిల్లీలో శనివారం మీడియాతో మాట్లాడిన ఎంపీ రఘురామ తన కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ యత్నానికి సంబంధించి రెక్కీ నిర్వహించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ ఆధారాలను త్వరలోనే డీజీపీకి అందజేస్తానని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర హోంశాఖకు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీ రఘురామ వెల్లడించారు. మరోవైపు బద్వేలు ఉపఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడి గెలిచిందని ఎంపీ రఘురామ ఆరోపించారు.

Tags:    

Similar News