ఇక నుంచి Gmail తో సాధారణ ఫోన్ కాల్స్..

దిశ, వెబ్‌డెస్క్ : టెక్ దిగ్గజం Google నుంచి సరికొత్త ఫీచర్ వచ్చింది. Gmail యాప్‌ను ఆధునీకరించి కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. Google Chat కోసం Gmail యాప్‌లో ఒకరితో ఒకరు వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి కొత్త ఫీచర్‌ను తీసుకోచ్చింది. Google చాట్‌ ద్వారా మీటింగ్‌లు, ఆడియో కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, ఈ ఫీచర్ వన్ టూ వన్ చాట్‌(సంభాషణలకు)లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆప్షన్ iOS, Androidలోని Gmail యాప్‌లో పనిచేస్తుంది. హైబ్రిడ్ […]

Update: 2021-12-08 07:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టెక్ దిగ్గజం Google నుంచి సరికొత్త ఫీచర్ వచ్చింది. Gmail యాప్‌ను ఆధునీకరించి కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. Google Chat కోసం Gmail యాప్‌లో ఒకరితో ఒకరు వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి కొత్త ఫీచర్‌ను తీసుకోచ్చింది. Google చాట్‌ ద్వారా మీటింగ్‌లు, ఆడియో కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, ఈ ఫీచర్ వన్ టూ వన్ చాట్‌(సంభాషణలకు)లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆప్షన్ iOS, Androidలోని Gmail యాప్‌లో పనిచేస్తుంది. హైబ్రిడ్ వర్క్ వరల్డ్‌లో సహోద్యోగులతో కనెక్ట్ అవ్వడానికి వీడియో, ఆడియో కాల్స్‌కి ఇది మరింత సులభంగా ఉంటుందని కంపెనీ బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది.

gmail appని ఓపెన్ చేశాకా google chat పై క్లిక్ చేసి వాయిస్ లేదా వీడియో ఆప్షన్‌ను ఎంచుకొని ఇతరులతో సంభాషించవచ్చు. ఇంతకు ముందు ఒకరితో ఒకరు మాట్లాడుకోడానికి అవతలి వాళ్ళకు లింక్‌ను పంపవలసి ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా నేరుగా సాధారణ ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.

Tags:    

Similar News