జాతీయ జెండాను అవమానించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

దిశ, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు జాతీయ జెండాని అవమానించారు. కాళ్లకు ఉన్న బూట్లు విప్పకుండానే జాతీయ జెండాను ఆవిష్కరించారు. దీంతో అనేక రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు రేగా కాంతారావు తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జాతీయ జెండాను అవమానించినందుకు బహిరంగ […]

Update: 2021-06-02 05:45 GMT

దిశ, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు జాతీయ జెండాని అవమానించారు. కాళ్లకు ఉన్న బూట్లు విప్పకుండానే జాతీయ జెండాను ఆవిష్కరించారు. దీంతో అనేక రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు రేగా కాంతారావు తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జాతీయ జెండాను అవమానించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని. నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News