ఫారెస్ట్ అధికారులపై రేగా కాంతారావు ఫైర్
దిశ, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఫారెస్ట్ అధికారులపై ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టా భూములు ఉన్నవారిని కూడా అటవీ శాఖ అధికారులు వేధిస్తున్నారని, బాధితులు ఎమ్మెల్యేకు విన్నవించడంతో, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పినపాక మండల అటవీ అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికారుల తీరుపై సీఐడీ విచారణ చేయించాలని సీఎం కేసీఆర్‌ను కోరతానని హెచ్చరించారు. పినపాక అటవీ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను ఆదివాసీలకు పంచాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తానని హామీ […]
దిశ, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఫారెస్ట్ అధికారులపై ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టా భూములు ఉన్నవారిని కూడా అటవీ శాఖ అధికారులు వేధిస్తున్నారని, బాధితులు ఎమ్మెల్యేకు విన్నవించడంతో, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పినపాక మండల అటవీ అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికారుల తీరుపై సీఐడీ విచారణ చేయించాలని సీఎం కేసీఆర్‌ను కోరతానని హెచ్చరించారు. పినపాక అటవీ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను ఆదివాసీలకు పంచాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు.