ఆర్టీసీ టికెట్ల డబ్బులు వాపస్
బుక్ చేసుకున్న టికెట్ల డబ్బులు ఏపీఎస్ ఆర్టీసీ ఖాతాదారులకు తిరిగి చెల్లించడం ఆరంభించింది. కరోనాపై పోరాటంలో భాగంగా విధించిన లాక్ డౌన్ 16వ తేదీతో ముగుస్తుందన్న ఆలోచనతో ఈ నెల తొలి వారంలో ఏపీఎస్ ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఆరంభించింది. అయితే ఊహించని విధంగా లాక్‌డౌన్ ఆంక్షలు మే 3 వరకు కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణాలన్నీ నిలిచిపోయాయి. బస్సులు బంద్ అయ్యాయి. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు ఆందోళన చెందడంతో ఆ డబ్బులు […]
బుక్ చేసుకున్న టికెట్ల డబ్బులు ఏపీఎస్ ఆర్టీసీ ఖాతాదారులకు తిరిగి చెల్లించడం ఆరంభించింది. కరోనాపై పోరాటంలో భాగంగా విధించిన లాక్ డౌన్ 16వ తేదీతో ముగుస్తుందన్న ఆలోచనతో ఈ నెల తొలి వారంలో ఏపీఎస్ ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఆరంభించింది. అయితే ఊహించని విధంగా లాక్‌డౌన్ ఆంక్షలు మే 3 వరకు కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణాలన్నీ నిలిచిపోయాయి. బస్సులు బంద్ అయ్యాయి.
టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు ఆందోళన చెందడంతో ఆ డబ్బులు వాపస్ చేస్తామని ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఈ మేరకు అడ్వాన్స్ టికెట్లకు సంబంధించిన రుసుమును ప్రయాణికులకు రిఫండ్ చేయడం ప్రారంభించింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రకటన జారీ చేశారు. ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన వారి ఖాతాల్లోకి నేరుగా ఆ రిఫండ్ డబ్బును జమ చేస్తున్నామని, ఆర్టీసీ బస్టాండ్లలో, ఏజంట్ల నుంచి పొందిన టికెట్లను ప్రయాణికులు స్వయంగా రద్దు చేసుకుని పూర్తి నగదును వాపసు పొందవచ్చని ఈ ప్రకటనలో తెలిపారు.
tags: apsrtc, ticket, lockdown