విద్యుత్ చార్జీలను తగ్గించండి
దిశ, మెదక్: పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫెడరేషన్ నేతలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు లక్ష్మయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఉన్నఫలంగా బిల్లుల స్లాబ్ రేట్లు పెంచి ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ […]
దిశ, మెదక్: పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫెడరేషన్ నేతలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు లక్ష్మయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఉన్నఫలంగా బిల్లుల స్లాబ్ రేట్లు పెంచి ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ సోమశేఖర్, నాయకులు భూమి శ్రీనివాస్ సంతోష్ , అశోక్, నాజర్ పటేల్, మల్లేశం, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.