ఏపీకి రెడ్ అలర్ట్

దిశ, వెబ్‌డెస్క్: గులాబ్ తుఫాన్ ఏపీని కలవరపెడుతోంది. సైక్లోన్ కారణంగా ఏపీలో భారీగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలుత అరెంజ్ అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణశాఖ.. తాజాగా ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదివారం సాయంత్రం లేదా రాత్రి సమయానికి భారీ వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముందని స్పష్టం చేసింది. ఏపీతో పాటు ఒడిశాకు వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలోని కళింగపట్నం, […]

Update: 2021-09-26 05:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: గులాబ్ తుఫాన్ ఏపీని కలవరపెడుతోంది. సైక్లోన్ కారణంగా ఏపీలో భారీగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలుత అరెంజ్ అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణశాఖ.. తాజాగా ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదివారం సాయంత్రం లేదా రాత్రి సమయానికి భారీ వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముందని స్పష్టం చేసింది.

ఏపీతో పాటు ఒడిశాకు వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలోని కళింగపట్నం, ఒడిశాలోని గోపాల్‌పూర్ మధ్యలో తుఫాన్ తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. అయితే తుఫాన్ కారణంగా ఇప్పటికే పలు ట్రైన్లను రైల్వేశాఖ రద్దు చేసింది.

Tags:    

Similar News