ఈ నెల 28న తిరుమలకు మాజీ సీఎం వైఎస్.జగన్

ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్ ఈ నెల 28న తిరుమల సందర్శించనున్నారు

Update: 2024-09-25 11:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్ ఈ నెల 28న తిరుమల సందర్శించనున్నారు. తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ కొన్ని రోజులుగా వివాదం సాగుతున్న క్రమంలో వైఎస్.జగన్ తిరుమల సందర్శనకు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ శ్రీవారిని దర్శించుకొని పాప ప్రక్షాళన పూజ చేయనున్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందంటూ సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని మాజీ సీఎం జగన్ ఎదురుదాడి చేస్తున్నారు. వేంకటేశ్వరస్వామి విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేశారని జగన్ తప్పుబడుతున్నారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి ఈ నెల 28న శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆలయాల్లోని పూజల్లో పాల్గొనాలని జగన్ ఇప్పటికే పిలుపునిచ్చారు.

అయితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు తిరుమల లడ్డూ కల్తీ విషయంలో తీవ్రమైన ఆరోపణలతో వైసీపీని..జగన్ ను ఇరకాటంలోని నెట్టారు. ఈ నేపథ్యంలో లడ్డూ కల్తీ విమర్శలను తిప్పికొట్టేందుకు జగన్ పాప ప్రక్షాళన పిలుపునిచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 


Similar News