కల్తీ నెయ్యి పై మొదటిసారి స్పందించిన కొడాలి నాని.. ఎమన్నాడంటే..?
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంపై స్పందించారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని(kodali nani) తిరుమల తిరుపతి లడ్డూ(Tirumala laddu) వ్యవహారంపై స్పందించారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. 2019కి ముందు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో 15 సార్లు నెయ్యిలో క్వాలిటీ లేదని ట్యాంకర్లు వెనక్కి పంపడం జరిగింది. కానీ 2019 తర్వాత వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చిన తర్వాత.. నెయ్యి క్వాలిటీ లేదని 18 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపడం జరిగిందని గుర్తు చేశారు. జులై 17న ఒక ట్యాంకర్‌లో నెయ్యి క్వాలిటీ లేదని వెనక్కి పంపడం జరిగింది. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు. రాజయకీయ లబ్ధి కోసమే జంతువుల కొవ్వు తో లడ్డు తయారు చేశారని ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.
Read More : టార్గెట్ డిప్యూటీ సీఎంగా ప్రకాష్ రాజ్ మరో ట్వీట్