రికార్డ్ స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కేసుల నమోదు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో ఏపీ ప్రజలు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి క్యూ కడుతున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేత అనంతరం తొలిసారిగా తిరుమల హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలోనే రూ.3 కోట్ల ఆదాయం సమకూరింది. స్వామివారి హుండీలో రూ.2.93 కోట్ల కానుకలను భక్తులు సమర్పించుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన భక్తుల సంఖ్య 25వేల లోపే ఉన్నప్పటికీ హుండీ ఆదాయం భారీగా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కొద్దిగా తగ్గుముఖం […]

Update: 2020-11-02 08:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కేసుల నమోదు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో ఏపీ ప్రజలు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి క్యూ కడుతున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేత అనంతరం తొలిసారిగా తిరుమల హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలోనే రూ.3 కోట్ల ఆదాయం సమకూరింది.

స్వామివారి హుండీలో రూ.2.93 కోట్ల కానుకలను భక్తులు సమర్పించుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన భక్తుల సంఖ్య 25వేల లోపే ఉన్నప్పటికీ హుండీ ఆదాయం భారీగా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టడం వల్లే స్వామివారి హుండీ ఆదాయం క్రమంగా పెరుగుతోందని ఆలయ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News