రేపటి నుంచి నామినేషన్లు
దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ తరఫున రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. నామినేషన్ల ప్రక్రియ కూడా దాంతో పాటే మొదలుకానుంది. ఈనెల 16వ తేదీ వరకు నామినేషన్లను దాఖలు చేయడానికి గడువు ఉంది. ఈనెల 19వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుండడంతో బరిలో ఎంత మంది అభ్యర్థులు ఉన్నారనేది తేలిపోతుంది. నవంబరు 3వ తేదీన పోలింగ్ జరగనుంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు […]
దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ తరఫున రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. నామినేషన్ల ప్రక్రియ కూడా దాంతో పాటే మొదలుకానుంది. ఈనెల 16వ తేదీ వరకు నామినేషన్లను దాఖలు చేయడానికి గడువు ఉంది. ఈనెల 19వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుండడంతో బరిలో ఎంత మంది అభ్యర్థులు ఉన్నారనేది తేలిపోతుంది. నవంబరు 3వ తేదీన పోలింగ్ జరగనుంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పేరుకు ఇది ఉపఎన్నికే అయినా ప్రధాన పార్టీలన్నీ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని అధికార టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మాజీ మంత్రి ఇమేజ్‌ను వాడుకునేలా ఆయన కుమారుడ్ని అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంపై దృష్టి పెట్టింది. వరుసగా రెండుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమంటూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఈ మూడు పార్టీల మధ్య పోటీలో ఓటరు ఏఅభ్యర్థిని గెలిపిస్తారో వచ్చే నెలలో తేలనుంది.