ఆ కారణంతో.. లవర్ పెళ్లికి దూరంగా ఉంటున్న స్టార్ హీరో
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ – కత్రినా కైఫ్ గతంలో ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల ఆ బంధానికి బ్రేక్ పడగా.. విక్కీ కౌశల్- కత్రినా ప్రేమించుకోవడం, అది కాస్తా పెళ్లి పీటలదాకా వెళ్లడం జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి రాజస్థాన్ వేదిక కానుండగా.. డిసెంబర్లో జరగనున్న వేడుక కోసం ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందాయి. కత్రినా ఫ్రెండ్, డైరెక్టర్ కబీర్ ఖాన్ ఇంట్లోనే వీరి రోకా ఫంక్షన్ […]
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ – కత్రినా కైఫ్ గతంలో ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల ఆ బంధానికి బ్రేక్ పడగా.. విక్కీ కౌశల్- కత్రినా ప్రేమించుకోవడం, అది కాస్తా పెళ్లి పీటలదాకా వెళ్లడం జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి రాజస్థాన్ వేదిక కానుండగా.. డిసెంబర్లో జరగనున్న వేడుక కోసం ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందాయి. కత్రినా ఫ్రెండ్, డైరెక్టర్ కబీర్ ఖాన్ ఇంట్లోనే వీరి రోకా ఫంక్షన్ జరగ్గా.. తనే ఈ పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటున్నారని తెలుస్తోంది.
అయితే ట్యూబ్‌లైట్ ఫిల్మ్ సమయంలోనే కబీర్ ఖాన్ – సల్మాన్ మధ్య బేధాభిప్రాయాలు రాగా.. ఇప్పుడు ఈ పెళ్లికి సల్మాన్ అటెండ్ అవుతారా లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ మ్యారేజ్ కాబట్టి ఇదే సాకుతో ఫంక్షన్ స్కిప్ చేస్తాడా? అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కానీ ఇక్కడ ప్రొఫెషనల్ కమిట్మెంట్ కూడా ఉన్నట్లు కనిపిస్తుండగా.. అదే టైమ్‌లో ‘టైగర్ 3, పఠాన్’ షూటింగ్స్‌కు హాజరుకావాల్సి ఉందని సమాచారం.