అదిరిపోయే ఫీచర్స్‌తో Realme నుంచి కొత్త గ్యాడ్జెట్
దిశ, వెబ్‌డెస్క్: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని మొబైల్ కంపెనీలు వరుసగా కొత్త కొత్త టెక్నాలజీ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. మరి కొన్ని సంస్థలు వచ్చే ఏడాది లాంచ్ చేయబోయే ఫోన్ల గురించిన అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో చైనీస్ ఫోన్ తయారీ సంస్థ Realme కూడా చేరింది. Realme సంస్థ GT 2 Pro స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఫోన్ జనవరి 4న చైనాలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ […]
దిశ, వెబ్‌డెస్క్: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని మొబైల్ కంపెనీలు వరుసగా కొత్త కొత్త టెక్నాలజీ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. మరి కొన్ని సంస్థలు వచ్చే ఏడాది లాంచ్ చేయబోయే ఫోన్ల గురించిన అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో చైనీస్ ఫోన్ తయారీ సంస్థ Realme కూడా చేరింది. Realme సంస్థ GT 2 Pro స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఫోన్ జనవరి 4న చైనాలో లాంచ్ కానుంది.
ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ కొత్త హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC, ఆండ్రాయిడ్ 12 Realme UI 3పై పనిచేస్తుంది. 6.7-అంగుళాల Quad-HD+ AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, వెనుకవైపు 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరా, 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది. 8GB RAM 128GB స్టోరెజ్, 12GB RAM 512GB స్టోరెజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 5,000mAhతో 65W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దీని ధర రూ.59,990. భారత్‌లో విడుదలపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.