దూరదర్శన్ లో మరోసారి రామాయణం ప్రసారం
ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదిపేస్తోంది. చాలా మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. పరిస్థితి ఊహించిన ప్రధాని నరేంద్రమోదీ దేశంలో 21 రోజుల లాక్ డౌన్ విధించారు. ఈ విపత్కర పరిస్థితుల్లొ ప్రజలు ఇంటి పట్టునే ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రజల్ని ఇంటి వద్దనే ఉంచేందుకు కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ఉపాయం ఆలోచించింది. 80, 90 దశకంలో ప్రఖ్యాతి గాంచిన రామాయణం సీరియల్‌ను మరోసారి ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రసార […]
ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదిపేస్తోంది. చాలా మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. పరిస్థితి ఊహించిన ప్రధాని నరేంద్రమోదీ దేశంలో 21 రోజుల లాక్ డౌన్ విధించారు. ఈ విపత్కర పరిస్థితుల్లొ ప్రజలు ఇంటి పట్టునే ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రజల్ని ఇంటి వద్దనే ఉంచేందుకు కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ఉపాయం ఆలోచించింది. 80, 90 దశకంలో ప్రఖ్యాతి గాంచిన రామాయణం సీరియల్‌ను మరోసారి ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రకటించారు. రామాయణాన్ని మరోసారి దూరదర్శన్‌లో ప్రసారం చేసేందుకు సంతోషిస్తున్నాం. శనివారం నుంచి రోజుకు రెండు ఎపిసోడ్‌లు రానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక ఎపిసోడ్, అదే రోజు రాత్రి 9 నుంచి 10 వరకు ప్రసారం చేయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
Tags: re telcast ramayan,doordarshan, central minister praksha javadekar, daily two episodes