ఆర్బీఐ మరో సంచలనం: పాత రూ.100 నోట్ల రద్దు

దిశ,వెబ్‌డెస్క్: దేశంలో పెద్దనోట్ల రద్దువల్ల ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయో మనందరికి తెలిసిందే. తాజాగా మరోసారి నోట్ల రద్దు ఈ అంశం తెరపైకి వచ్చింది. మరో రెండునెలల్లో అంటే మార్చినాటికి పాత రూ.100 నోట్లను రద్దు చేసి, కొత్తనోట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ప్రధాని మోడీ ఐదేళ్ల క్రితం నవంబర్ 8,2016 రాత్రి 8 గంటలకు పెద్ద నోట్లు అంటే రూ.500, రూ.1000 ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో […]

Update: 2021-01-23 01:14 GMT

దిశ,వెబ్‌డెస్క్: దేశంలో పెద్దనోట్ల రద్దువల్ల ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయో మనందరికి తెలిసిందే. తాజాగా మరోసారి నోట్ల రద్దు ఈ అంశం తెరపైకి వచ్చింది. మరో రెండునెలల్లో అంటే మార్చినాటికి పాత రూ.100 నోట్లను రద్దు చేసి, కొత్తనోట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

ప్రధాని మోడీ ఐదేళ్ల క్రితం నవంబర్ 8,2016 రాత్రి 8 గంటలకు పెద్ద నోట్లు అంటే రూ.500, రూ.1000 ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో 86శాతంగా ఉన్న కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. కేంద్రం సైతం రూ.500, రూ.1000 నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

మోడీ పెద్ద నోట్ల రద్దు దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆర్ధిక వేత్తలు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే అనూహ్యంగా2016-17 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ రేటు నాటికి నాలుగేండ్ల గరిష్టానికి చేరుకున్నది. 2017-18లో 45ఏండ్ల గరిష్టానికి చేరుకుంది. దీంతో తాజాగా ఆర్బీఐ పాత రూ.100నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పాత కరెన్సీ నోట్ల రద్దు విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ జనరల్ మేనజర్ బీ. మహేశ్ తెలిపారు. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో డిస్ట్రిక్ లెవల్ సెక్యూరిటీ కమిటీ (dlsc), జిల్లా స్థాయి కరెన్సీ మేనేజ్‌మెంట్ కమిటీ (dlmc)) సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. అందుకే గడిచిన 6ఏళ్లుగా ఈ నోట్లను ఆర్బీఐ ముద్రించడం లేదని చెప్పారు. ప్రస్తుతానికి పాత నోట్లు అంతటా చెల్లుబాటు అవుతాయని, బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే పాత నోట్లను మాత్రం ఆర్బీఐ సేకరిస్తుందని, తిరిగి వాటిని మార్కెట్‌లోకి విడుదల చేయబోమని ఆర్బీఐ జనరల్ మేనజర్ బీ. మహేశ్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News