ఈఎంఐకి మూడు నెలల గడువు..ఆర్‌బీఐ శుభవార్త!

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్నే భయపెడుతున్న కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు కీలకమైన నిర్ణయాలను ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రధానమైన నిర్ణయాలను తీసుకున్నామని ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు. ప్రస్తుతమున్న రెపో రేటును 75 బేసిస్ పాయింట్లను తగ్గించి, 4.4 శాతంగా, రివర్స్ రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు తగ్గించి 4 శాతానికి చేర్చారు. దేశంలో నెలకొన్న పరిస్థితులను ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోందని […]

Update: 2020-03-27 00:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్నే భయపెడుతున్న కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు కీలకమైన నిర్ణయాలను ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రధానమైన నిర్ణయాలను తీసుకున్నామని ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు. ప్రస్తుతమున్న రెపో రేటును 75 బేసిస్ పాయింట్లను తగ్గించి, 4.4 శాతంగా, రివర్స్ రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు తగ్గించి 4 శాతానికి చేర్చారు. దేశంలో నెలకొన్న పరిస్థితులను ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోందని గవర్నర్ శక్తికాంత్ దాస్ వివరించారు. ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడం కోసం అవసరమైన చర్యలను చేపడుతున్నామని, తగిన నిర్ణయాలతో సంక్షోభాన్ని ధీటుగా ఎదుర్కొంటామని శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అలాగే, ఏప్రిల్ 3న జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేశామని, ఏప్రిల్ 24,25,26 తేదీల్లో పరిస్థితులను పూర్తీగా సమీక్షిస్తామని వివరించారు. వైరస్ వ్యాప్తి, తీవ్రత ఎన్ని రోజులు కొనసాగుతుందనే దానిపైనే రానున్న కాలంలో వృద్ధిరేటు, ద్రవ్యోల్బణానికి సంబంధించి అంచనాలు ఉంటాయని తెలిపారు.

అంతేకాకుండా, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర లాక్‌డౌన్ విధించింది. దీంతో చాలామందికి నెలవారి చెల్లింపుల్లో ఆటంకాలను ఆర్‌బీఐ పరిశీలించింది. రానున్న మూడు నెలలు చెల్లించాల్సిన ఈఎంఐలపై మారటోరియం విధించింది. మార్చి నుంచి మూడు నెలల వరకు ఈఎంఐ చెల్లించకపోయిన పర్లేదని, దీని ప్రభావం సెబిల్ స్కోరుపై ఉండదని స్పష్టం చేసింది. ఈ మూడు నెలల ఈఎంఐ చెల్లింపులు భవిష్యత్తులో వీలును బట్టి చెల్లించవచ్చని వివరించింది.

ఈ రెండు ప్రధాన నిర్ణయాలతో పాటు కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రణాళికలను పరిశీలించడం, మార్కెట్లకు ద్రవ్య లభ్యతపై స్థిరత్వాన్ని ఇవ్వడం, బ్యాంకు రుణాలు వంటి చర్యలు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైరస్ చూపిస్తున్న తీవ్ర ప్రభావం కారణంగా జీడీపీపై ప్రతికూలంగా ఉందన్నారు. ఈ పరిణామాలను అధిగమించి ధీర్ఘకాల రుణాలపై ప్రస్తుతం నిషేధాన్ని విధిస్తున్నట్టు చెప్పారు.

Tags: Reserve Bank Of India, Rbi Press Conference, Shaktikanta Das, Coronavirus, COVID-19

Tags:    

Similar News