ఐసీసీ నెంబర్ 1 ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా
దిశ, స్పోర్ట్స్: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో జేసన్ హోల్డర్‌ను వెనక్కు నెట్టి నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. అగ్రస్థానంలో ఉన్న వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్‌ను రెండో స్థానానికి నెట్టిన జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. మూడో ర్యాంకులో బెన్ స్టోక్స్, నాలుగో ర్యాంకులో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. బౌలర్ల విభాగంలో పాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో సౌథీ ఉన్నాడు. […]
దిశ, స్పోర్ట్స్: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో జేసన్ హోల్డర్‌ను వెనక్కు నెట్టి నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. అగ్రస్థానంలో ఉన్న వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్‌ను రెండో స్థానానికి నెట్టిన జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. మూడో ర్యాంకులో బెన్ స్టోక్స్, నాలుగో ర్యాంకులో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. బౌలర్ల విభాగంలో పాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో సౌథీ ఉన్నాడు. అశ్విన్ 5వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విభాగంలో 4వ ర్యాంకులో నిలిచాడు. స్మిత్ అగ్రస్థానంలో ఉండగా కేన్ విలియమ్‌సన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ర్యాంకులు
బ్యాట్స్‌మెన్
1. స్టీవ్ స్మిత్ (891)
2. కేన్ విలియమ్‌సన్ (886)
3. మార్నస్ లబుషేన్ (878)
4. విరాట్ కోహ్లీ (814)
5. జో రూట్ (797)
బౌలర్లు
1. పాట్ కమిన్స్ (908)
2. రవిచంద్రన్ అశ్విన్ (850)
3. టిమ్ సౌథీ (830)
4. జోష్ హాజెల్‌వుడ్ (816)
5. నీల్ వాగ్నర్ (815)
ఆల్‌రౌండర్స్
1. రవీంద్ర జడేజా (386)
2. జేసన్ హోల్డర్ (384)
3. బెన్ స్టోక్స్ (377)
4. రవిచంద్రన్ అశ్విన్ (353)
5. షకీబుల్ హసన్ (338)