అజ్ఞాతం వీడి పోలీసుల ఎదుట లొంగిన కూన
దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ మూడు రోజుల అజ్ఞాతం వీడారు. పొందూరు తహశీల్దార్ రామకృష్ణను అసభ్య పదజాలంతో దూషించి, బెదిరించిన కేసులో రవికుమార్ నిందితుడు. దీంతో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకునేందుకు ఆయన నివాసానికి వెళ్లగా ఆయన ఇంట్లో లేరు. దీంతో ఆయన కోసం గాలింపు చేపట్టారు. మహానాడు ఆరంభమైన నేపథ్యంలో పార్టీకి ఎదురుగాలి వీయకుండా ఉండేందుకు […]
దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ మూడు రోజుల అజ్ఞాతం వీడారు. పొందూరు తహశీల్దార్ రామకృష్ణను అసభ్య పదజాలంతో దూషించి, బెదిరించిన కేసులో రవికుమార్ నిందితుడు. దీంతో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకునేందుకు ఆయన నివాసానికి వెళ్లగా ఆయన ఇంట్లో లేరు. దీంతో ఆయన కోసం గాలింపు చేపట్టారు. మహానాడు ఆరంభమైన నేపథ్యంలో పార్టీకి ఎదురుగాలి వీయకుండా ఉండేందుకు ఆయన నేడు పొందూరు పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నాయకులు వెంటరాగా లొంగిపోయారు.